Vijaya Rama Rao: మాజీ మంత్రి విజయరామారావు మృతి!
Vijaya Rama Rao: మాజీ మంత్రి, సీబీఐ మాజీ డైరెక్టర్ విజయరామారావు హైదరబాద్ లో ఆస్పత్రిలో చికిత్స చెందుతూ కన్నుమూశారు. ఏటూరు నాగారంలో జన్మించిన విజయరామారావు 1959లో ట్రైనీ ఐపీఎస్ గా విధుల్లో చేరి, ఆ తర్వాత హైదరబాద్ కమిషనర్, సీబీఐ డైరెక్టర్గా హవాలా కుంభకోణం, బాబ్రీ మసీదు విధ్వంసం, ముంబై బాంబు పేలుళ్లు, ఇస్రో గూఢచర్యం వంటి కేసులు దర్యాప్తు చేశారు. 1999 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా పి.జనార్దన్ రెడ్డి(PJR)పై గెలిచి మంత్రి అయ్యారు. నిజానికి ఒకప్పుడు విజయరామారావు వల్లే కేసీఆర్‌కు మంత్రిపదవి దక్కలేదు. సీబీఐ మాజీ డెరైక్టర్ కె.విజయరామారావును మంత్రి మండలిలోకి తీసుకున్నానన్న కారణం చూపి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు పదవి ఇవ్వకుండా కేసీఆర్‌ను మంత్రి పదవికి దూరం పెట్టారు. కేసీఆర్‌కు డిప్యూటీ స్పీకర్ పదవిచ్చి సరిపెట్టడంతో అసంతృప్తికి గురైన కేసీఆర్ ఏకంగా పార్టీకి డిప్యూటీ స్పీకర్ పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు.