Etela Rajendar: ఆ పదవికి ఈటెల రాజేందర్ రాజీనామా?
Etela Rajendar: తెలంగాణ సీఎం కేసీఆర్ తో విభేదించి, పార్టీని వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఈటల రాజేందర్.. . ఆత్మగౌరవం నినాదంతో కేసీఆర్ పై హుజురాబాద్ ఉప ఎన్నికల బరిలో గెలిచి తన సత్తా చాటుకున్నాడు. ఈటల రాజేందర్ పట్ల బిజెపి అధిష్టానానికి ఒక ప్రత్యేకమైన గౌరవం, విశ్వాసం రెండు ఉన్న క్రమంలో పార్టీలోకి వచ్చిన అనతి కాలంలోనే ఈటల రాజేందర్ కు అనేక కీలక బాధ్యతలను అప్పగించి పార్టీని బలోపేతం చేయాలని కోరారు. ఈటెల రాజేందర్ ను చేరికల కమిటీ చైర్మన్ గా నియమించి, తెలంగాణ రాష్ట్రంలో ఇతర పార్టీల నుంచి కీలక నాయకులను పార్టీలోకి తీసుకురావాల్సిందిగా బాధ్యత అప్పగించారు. కానీ అయ్యాన దూకుడు చూపించలేకపోతున్నారు. ఇక ఇప్పుడు బిజెపి చేరికల కమిటీ చైర్మన్ పదవికి ఈటెల రాజేందర్ రాజీనామా చేసేందుకు సిద్ధం అయ్యారని ప్రచారం జరుగుతోంది. తనను ఈ పదవి నుంచి తప్పించాలని అగ్రనేతలు అమిత్ షా, నడ్డా ముందు ఈటల స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఇటీవల జేపీ నడ్డా నివాసంలో జరిగిన సమావేశంలో ఈ కీలక పరిణామం జరిగినట్టు తెలుస్తోంది. చేరికల కమిటీ సమావేశంలోనూ పాల్గొనేందుకు ఈటెల రాజేందర్ నిరాసక్తత కనబరచినట్టు తెలుస్తోంది. పార్టీలో చేరేందుకు వచ్చే నాయకులకు టికెట్ భరోసా ఇవ్వకుండా ముందుకు వెళ్లడం సాధ్యం కాదని ఈటెల రాజేందర్ చెబుతున్నారు.