111 జీవోపై నిషేధం ఎత్తివేత వ్యవహారంపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. హైదరాబాద్ వాసులకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల తీవ్ర ఆరోపణలు చేశారు.
Etala on Kcr : తెలంగాణ (Telangana) సీఎం కేసీఆర్ (Kcr) పై మరో సారి మండిపడ్డారు హుజూరాబాద్ (Huzurabad) ఎమ్మెల్యే (MLA)ఈటల (Etala) రాజేందర్. 111 జీవోపై నిషేధం ఎత్తివేతతో హైదరాబాద్ (Hyderabad) వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారని ఈటల విమర్శించారు. నిషేధం ఉన్న భూములను ఎందుకు రిజిస్ట్రేషన్ ఎందుకు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. వేల కోట్ల భూములు గోల్డ్ స్టోన్ ప్రసాద్ (Gold Stone Prasad) మేనేజ్ చేసేవారని అన్నారు. అవన్నీ కేసీఆర్ అనుచరులకు అప్ప చెబుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కే సీఆర్ ఉద్యమ సమయంలో ఆంధ్ర వాళ్ళు తెలంగాణ భూములను కొల్లగొడుతున్నారు అని చెప్పేవాడని గుర్తు చేశారు. గతంలో గ్రీన్ ట్రిబ్యునల్ కు పోతే ఆగిపోయిందని, ఇప్పుడు కూడా గ్రీన్ ట్రిబ్యునల్ కు పోతే ఆగిపోతుందని ఈటెల పేర్కొన్నారు.
ధరణి … రైతుల కొంప ముంచింది
ధరణి రైతుల కొంప ముంచిందని, దరణిలో 14 లక్షల మంది దరఖాస్తులు పెట్టుకున్నారని, ఎన్నో తప్పులు జరిగాయని ఆరోపించారు. తెలంగాణ రైతులు నిశ్చింతగా నిద్ర పోయే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మియాపూర్ స్కామ్ ఏమైంది?
మియాపూర్ స్కాం ఎందుకు బయట పెట్టట్లేదని? ప్రశ్నించారు. ఇలా వచ్చిన డబ్బుతో రాబోయే రోజుల్లో రాజకీయాలు చేస్తారని ఆరోపించారు. నాలాంటి వాళ్ళ గొంతు కోయాలని ఓటు ఐదు వేల రూపాయలు ఇస్తారని ఆరోపణలు గుప్పించారు. కొత్త సచివాలయంలో ఎమ్మెల్యే లకు కూడఅనుమతి లేదు, సామాన్య పబ్లిక్ కు అసలు అనుమతి లేదని మండిపడ్డారు.
కర్ణాటకలో గెలిస్తే సరిపోతుందా?
కర్ణాటకలో గెలవగానే తెలంగాణలో గెలుస్తుందా? అంటూ ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోకి వెళ్లారని గుర్తు చేశారు. రేపు కాంగ్రెస్ , బీఆర్ఎస్ కలుస్తాయి ఏమో అని ప్రచారం జరుగుతోందని కీలక వ్యాఖ్యలు చేశారు. మా అధ్యక్షుడు బాగానే పని చేస్తున్నారని, బీజేపీ తెలంగాణలో గెలవాలంటే ఇంకా శక్తి కావాలి అంటున్నామని ఈటెల రాజేందర్ తెలిపారు.