హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన ఎలిమినేడ్ భూ బాధితులు
హై కోర్టులో ఎలిమినేడ్ బాధితులు పిటీషన్ దాఖలు చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని ఎలిమినేడ్‌లో TSIIC చేస్తున్న భూ సేకరణ ఆపాలని తమ పిటీషన్‌లో పేర్కొన్నారు. ఎలిమినేడ్‌లో భూ సేకరణను అడ్డుకున్నట్లు బాధితులు తెలిపారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం SC, ST వర్గాలకు చెందిన వారి భూములు తీసుకోవద్దని అధికారులకు తెలిపినా వారు వినడంలేదని తెలిపారు.
2013 భూ సేకరణ చట్టం ప్రకారం తమకు అన్ని రకాల వసతులు కల్పించి, తమ భూమి తీసుకున్నందుకు నష్ట పరిహారం చెల్లించాలన్నారు. భూ సేకరణకు సంబంధించిన అంశాన్ని పలువురు ప్రభుత్వ అధికారుల వద్దకు తీసుకెళ్లామని, ప్రజా ప్రతినిధుల వద్ద కూడా తమ గోడు వెళ్లబోసుకున్నట్లు బాధితులు కోర్టుకు తెలిపారు.