Auditor Buchibabu: ఆడిటర్ బుచ్చిబాబుకు మళ్లీ నోటీసులు!
Auditor Buchibabu: ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ బుచ్చి బాబుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. గతంలో ఈ కేసులో ఆయనను అరెస్ట్ చేయగా ఆయన ఇటీవలే బైలుపై విడుదలయ్యారు. ఇక మరోమారు మార్చి 15 న తమ ముందు హాజరు కావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. అరుణ్ పిళ్ళైతో కలిపి ఆడిటర్ బుచ్చి బాబును ఈడీ విచారించనున్నట్టు తెలుస్తోంది. ఇక ఈడి వాదన ప్రకారం లిక్కర్ కేసులో చాలా కీలక సమయంలో పిళ్ళై వాంగ్మూల ఉపసంహరణ చేసుకున్నారని అంటున్నారు. పెళ్ళై విచారణకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీ ఆధారాలు కూడా ఉన్నాయని ఈడీ చెబుతోంది. ఈడి సరైన విధానంలోనే పిళ్ళైని విచారణ చేశామని ఈదీ చెబుతోంది. పిళ్ళై మీద విచారణ సందర్భంగా ఎటువంటి వత్తిడి తీసుకుని రాలేదని ఈదీ చెబుతోంది. తాము అతన్ని బెదిరించ లేదు, టార్చర్ చెయ్యలేదని ఈడీ చెబుతోంది. ఇక మా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని ఈడీ చెబుతోంది.