Jagityala Municipal Chairman Shravani Resigned: బీఆర్ఎస్ లోభగ్గుమన్న విభేదాలు..జగిత్యాల మున్సిపల్ చైర్మన్ రాజీనామా
Jagityala Municipal Chairman Shravani Resigned: తనకు చెప్పకుండా ఎలాంటి పనులు చేయవద్దని హుకూం జారీ చేశాడని ఒకే పార్టీలో ఉన్న కూడా తనని వేధిస్తున్నాడని జగిత్యాల జిల్లా మున్సిపల్ చైర్మన్ శ్రావణి తన పదవికి రాజీనామా చేసారు. మూడేళ్లుగా ఎమ్మెల్యే సంజయ్ అడుగడుగునా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆ ఎమ్మెల్యే నుంచి తనకు ప్రాణహాని ఉందని నాకు భద్రత కల్పించాలని కోరారు.
ఒక వ్యక్తి స్వార్థం కోసం బహుజనవర్గాలకు చెందిన ఓ ఆడపడుచు అణచివేతకు గురి అవుతోంది అంటూ ఆవేదన వ్యక్తంచేశారు శ్రావణి. పేరుకు మాత్రమే నేను చైర్ పర్సన్ ను కానీ పెత్తనం అంతా ఆ ఎమ్మెల్యేదే అని చెప్పుకుంటు కన్నీళ్లు పెట్టుకున్నారు. అభివృద్ధి పనులకు అడుగడుగునా అడ్డుపడుతున్నాడని..ఎంత కష్టపడుతున్న పెరుమాత్రం తనదేనంటూ ప్రచారం చేసుకుంటున్నాడని..ఏ పని తలపెట్టిన ఎవరిని రాకుండ అడ్డుకుంటున్నాడని ఆవేదనను వెళ్ళబుచ్చుకుందది. తనకు చెప్పకుండా ఎలాంటి పనులు చేయవద్దని హుకూం జారీ చేశాడన్నారు. తాను నరక ప్రాయంగా మున్సిపల్ ఛైర్మన్ పదవిలో కొనసాగుతున్నానని, నడి రోడ్డుపై అమరవీరుల స్థూపం సాక్షిగా అవమానానికి గురయ్యానని ఆమె బాధను వెళ్లగక్కారు.
డబ్బు కావాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. కానీ మేం ఇచ్చులేం అని చెప్పినా వేధింపులు మానలేదని పదే పదే వేధించేవారని ఇక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పెట్టే టార్చర్ భరించలేక చైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని వివరించారు. తనకు అనుకూలంగా ఉన్న కొంతమంది కౌన్సిలర్లను కూడా ఇబ్బంది పెట్టారని శ్రావణి ఆవేదన వ్యక్తం చేశారు. ఇక కొద్దీరోజుల కిందట భూపాలపల్లిలో తెలంగాణ బొగ్గు గని కార్మికుల సంఘం కొత్త భవనం ప్రారంభోత్సవంలో బీఆర్ఎస్‌లో వర్గ విబేధాలు బయటపడ్డాయి. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం భవనంలో శిలాఫలకంలో ఎమ్మెల్సీ మధుసూదనాచారి పేరు లేదని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి బీఆర్ఎస్ లో వర్గ విభేదాలు సృష్టించే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాఒకచోటనే కాదు బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతపోరు చాల చోట్లనే ఉంది. మరి ఎలక్షన్స్ దగ్గరపడుతున్నవేళ పార్టీలో ఇదో తలనొప్పిగా మారింది. మరి పార్టీ అధిష్టానం ఏ మేరకు యాక్షన్ తీసుకుంటుందో చూడాలి.