BRS MLC Kavitha: కవితకు ఢిల్లీ పోలీసుల షాక్!
BRS MLC Kavitha: ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద రేపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దీక్ష చేపట్టబోతున్న సంగతి తెలిసిందే. మహిళా బిల్లు కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్షకు కవిత నిర్ణయం తీసుకున్నారు. అయితే చివరి నిమిషంలో అనుమతి రద్దు చేసిన పోలీసులు, మరో ప్రాంతంలో చేసుకోవాలని సూచనలు చేశారు. ముందే అనుమతి తీసుకున్నా ఎలా రద్దు చేస్తారని కవిత ప్రశ్నించినా దీక్షా వేదిక మార్చుకోవాలని స్పష్టం చేసిన పోలీసులు తామేమీ చేయలేమని తేల్చి చెప్పారు. ఇక ఈ క్రమంలో జంతర్ మంతర్ వద్దకు కవిత బయలుదేరి వెళ్లారు. ఇక మ్మెల్సీ కవిత గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఈడీ విచారణకు రెండు రోజుల సమయం అడిగా, మాకు రెండు రోజుల సమయం ఇస్తే ఈడీకి వచ్చిన నష్టమేంటి? అని ప్రశ్నించారు. మా ఇంటికి వచ్చి విచారణ చేయాలని ఈడీని రిక్వెట్ చేశాం కానీ, ఈడీ దీనికి అంగీకరించలేదని ఆమె అన్నారు. ఇక ఈడీ విచారణకు వంద శాతం సహకరిస్తానని, తానే ఈడీ ముందుకు ధైర్యంగా వచ్చి, విచారణ ఎదుర్కొంటానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు