Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీనా?
Delhi Liquor Scam: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ స్కాం సంచలనం సృష్టిస్తున్న సంగతి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఢిల్లీలో ఒక కీలక నేత అరెస్టయి జైల్లో ఊచలు లెక్కిస్తూ ఉండగా ఆయన తన పదవికి సైతం రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఈ లిక్కర్ స్కాం బిఆర్ఎస్ చుట్టూ తిరుగుతూ ఉండగా తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవితను ఈ కేసు వెంటాడుతోంది. ఈరోజు సుదీర్ఘంగా కవితను రెండవసారి ఈడి విచారించింది. ఈడీ విచారణలో ఆమెను అరెస్టు చేసే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది కానీ ఈ ఆర్టికల్ రాసే వరకు అయితే ఆమె అరెస్టు అయితే జరగలేదు.
అయితే ఈ లిక్కర్స్ స్కాం అంతా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ అనే వాదన ఇప్పుడు ఆసక్తికరంగా తెరమీదకు వచ్చింది. ఈ వాదనను తీసుకొచ్చింది తెలంగాణ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. ఆయన తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి బిజెపి, బీఆర్ఎస్ డ్రామాలాడుతున్నాయని అన్నారు. వాస్తవానికి ఇప్పటివరకు ఈ లిక్కర్ స్కాం గురించి గానీ కవిత గురించి గానీ మాట్లాడకుండా వ్యూహాత్మక మౌనం పాటిస్తూ వచ్చారు. రేవంత్ రెడ్డి అయితే సొంత పార్టీ నేతల నుంచి పెద్ద ఎత్తున ఈ విషయం మీద స్పందించాలని డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన ఆయన ఈ లిక్కర్స్ స్కాంకి ఎవరు నామినీలు ఎవరు బినామీలు అనేది ఈడీ స్పష్టంగా చెబుతుందని ఈ వ్యవహారంలో కవిత పాత్ర చాలా స్పష్టంగా ఉందని చెబుతున్న ఈడి ఆమె ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు.
ఇదంతా ప్రశాంత్ కిషోర్ వ్యూహంలో భాగం అని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త చర్చ మొదలైంది. బీఆర్ఎస్, బీజేపీ మధ్య రహస్య ఒప్పందాలు ఉన్నాయా అందుకే ఈ రెండు పార్టీలు ప్రత్యర్థులుగా పైకి కొట్లాడుకుంటునట్లు కనిపించినా రెండు లోపాయికారీ ఒప్పందాలు చేసుకున్నాయా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. రెండులో పార్టీలు లో లోపల ఒక్కటేనని గతంలో కూడా రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో వ్యాఖ్యానించారు. కానీ ఇప్పుడు మాత్రం సరికొత్త చర్చ జరుగుతోంది ఎందుకంటే ఢిల్లీలో ఉప ముఖ్యమంత్రిని అరెస్టు చేసి లోపలికి పంపించిన ఈడి ఎందుకు ఒక ఎమ్మెల్సీ అయిన కవితను అరెస్టు చేయలేకపోతోంది.
పోనీ ఆమె తప్పు చేయలేదా అంటే చేసిందని ఈడీ బల్ల గుద్ది వాదిస్తోంది. కానీ ఆమెను అరెస్ట్ చేసే విషయంలో మాత్రం మీనమేషాలు లెక్కిస్తోంది. ఈ రోజు పరిశీలించినట్లయితే తెలుగు మీడియా కవరేజ్ మొత్తం కవిత అంశం మీదే ఉంది. కవిత సుదీర్ఘంగా విచారణకు హాజరవ్వడం ఆ తర్వాత ఆమె అరెస్టు కాబోతోంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ అదేమీ జరగలేదు కేవలం ఇదంతా ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ అని కాంగ్రెస్ వార్తలు తెరమీద కూడా రాకుండా చేసేందుకు ఈ మేరకు చేస్తున్నారని రేవంత్ రెడ్డి అంటున్నారు. ఈ విషయంలో మీ ఉద్దేశం ఏంటో కింద కామెంట్ చేయండి.