ఆదిలాబాద్లో ఉగ్రవాద లింకులు.. రంగంలోకి కౌంటర్ ఇంటెలిజెన్స్
ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసుల సోదాలు కలకలం రేపుతున్నాయి.హర్యానాలో దొరికిన నలుగురు ఉగ్రవాదులు ఇచ్చిన సమాచారంతో సోదాలు చేస్తున్నారు. ఆదిలాబాద్ ఉట్నూర్ మీదుగా నాందేడ్‌కు ఆర్డీఎక్స్ సరఫరా చేయాలని ఆదేశాలు అందినట్లు పట్టుబడిన ఉగ్రవాదులు వెల్లడించారు. ఆదిలాబాద్‌లోని రెండు ప్రాంతాల్లో పోలీసుల సోదాలు చేస్తున్నారు. నిర్మల్, భైంసా మీదుగా నాందేడ్ సరఫరా చేయాలని ఆదేశాలు అందాయని అంటున్నారు. నాందేడ్ నుంచి ఢిల్లీ వెళ్లే రూట్లను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆదిలాబాద్, కాగజ్‌నగర్, నిర్మల్, మంచిర్యాలలో దాబాల దగ్గర కొత్త వ్యక్తుల కదలికపై కౌంటర్ ఇంటెలిజెన్స్ ఆరా తీస్తోంది. పాక్‌కు చెందిన ఖలిస్తాన్ ఉగ్రవాది హరివిందర్‌సింగ్ రిందాతో ఇక్కడి వ్యక్తులకు గల సంబంధాలపై కూడా ఆరా తీస్తున్నారు. సిగ్నల్ యాప్ ద్వారా రిందా పంపిన లొకేషన్‌లో ఉన్న కొత్త వ్యక్తులపై కూడా కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు ఆరా తీస్తున్నారు.