కేసీఆర్ కు కౌంట్ డౌన్ స్టార్టయిందని.. ఏది ఏమయినా తెలంగాణ ప్రజలకు మంచి జరగాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. సోనియా గాంధీ తో పాటు రాహుల్ గాంధీ తో కూడా భేటీ అయ్యానని షర్మిల చెప్పారు.
YS Sharmila: సీఎం కేసీఆర్(CM KCR)కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల(YS Sharmila) చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ(Sonia Gandhi)తో భేటీ ముగిసిన తర్వాత.. షర్మిల మీడియాతో మాట్లాడారు. కేసీఆర్(CM KCR)కు కౌంట్ డౌన్ స్టార్టయిందని.. ఏది ఏమయినా తెలంగాణ ప్రజలకు మంచి జరగాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు.
సోనియా గాంధీ(Sonia Gandhi)తో పాటు రాహుల్ గాంధీ(Rahul Gandhi)తో కూడా భేటీ అయ్యానని షర్మిల చెప్పారు. తాజా రాజకీయ పరిస్థితులపైన తామంతా కలిసి కూర్చుని చర్చించినట్లు ఆమె అన్నారు. ఈ చర్చలు నిర్మాణాత్మకంగా జరిగాయన్న షర్మిల.. తెలంగాణ వాసులకు తాను మేలు చేసేలా పనిచేస్తానని హామీ ఇచ్చారు.
మరోవైపు షర్మిల ఈ రోజో, రేపో కాంగ్రెస్‌లో చేరుతుందని వార్తలు జోరందుకున్న ఈ సమయంలోనే ఆమె..సోనియాతో భేటీ కావడం మరోసారి పెద్ద చర్చకు దారి తీస్తోంది. ఇప్పటికే జరగాల్సిన చర్చలు,ఇవ్వాల్సిన హామీలు ఇవ్వడం ఇద్దరి మధ్య జరిగిపోయాయని షర్మిల చేరిక ఇక నామ మాత్రమే అనుకుంటూ ఉండగా.. సోనియమ్మతో , షర్మిల మరోసారి భేటీ కావడంతో ఇక షర్మిల అతి త్వరలోనే సైకిలెక్కడం ఖాయం అని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. సోనియమ్మ ఇచ్చిన ధైర్యం, హామీలతోనే కేసీఆర్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని పంచు డైలాగులకు పని చెప్పిందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే తాను ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి షర్మిల ప్రకటించారు . అయితే ఇక త్వరలోనే తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి.. అధికారక ప్రకటన చేసిన ఈసారి కాంగ్రెస్ నుంచి బరిలో దిగడమే మిగులుందని పార్టీ వర్గాలు చెబుతున్నారు.