Covid Cases: తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు.. కొత్త కేసులు ఎన్నంటే ?
Telangana Corona:తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 795 కోవిడ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కోవిడ్ కేసులు అత్యధికంగా హైదరాబాద్‌లోనే నమోదైనట్లు అధికారులు తెలిపారు. నగరంలో 343 మంది కోవిడ్ బారిన పడగా.. రంగారెడ్డి జిల్లాలో 54, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 54, నల్గొండ జిల్లాలో 42, పెద్దపల్లి జిల్లాలో 33, ఖమ్మం జిల్లాలో 32 కోవిడ్ కేసులు వెలుగులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఐతే అదే సమయంలో కరోనా నుంచి 658 మంది కోలుకున్నారని తెలిపారు. ఇవాళ కోవిడ్‌తో ఎవరూ మరణించలేదని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
మరోవైపు తెలంగాణలో ఇప్పటివరకు 8 లక్షల 15 వేల 679 మందికి కరోనా సోకగా.. కోవిడ్ నుంచి 8 లక్షల 6 వేల 865 మంది కోలుకున్నట్లు తెలిపారు. మరో 4 వేల 703 మంది ఆస్పత్రిలో, హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటి వరకు 4 వేల 111 మంది మరణించారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కోవిడ్ విజృభిస్తుండగా ప్రజలు మాత్రం కోవిడ్ నియమాలు పాటించడం లేదు. నగరంలో రోడ్లపై ప్రజలు మాస్క్‌లు లేకుండా తిరుగుతున్నారు. పోలీసులు కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు.