Congress on Komatireddy: చెరుకు సుధాకర్, కోమటిరెడ్డి వ్యవహారం అధిష్టానం దృష్టికి!
Congress on Komatireddy: చెరుకు సుధాకర్, కోమటిరెడ్డి వ్యవహారాన్ని ఏఐసీసీకి సమాచారం ఇచ్చామని కాంగ్రెస్ నేత మహేష్ గౌడ్ అన్నారు. కోమటిరెడ్డి ఫోన్ లో ఇలా మాట్లాడటం సరికాదన్న ఆయన ఎవరు, ఎవరిని కించపరిచేలా మాట్లాడినా ఒప్పుకోమని అన్నారు. వెంకట్ రెడ్డి మాటలు తగదు, స్థాయి దిగజారడం ఎవరికి మంచిది కాదని ఆయన అన్నారు. బీఆర్ఎస్ సర్కార్ పై ప్రజల్లో భ్రమలు తొలగిపోయాయని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కేసీఆర్ సర్కార్ పై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తమ కష్టాలు తొలగుతాయి అని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. అందుకే కాంగ్రెస్ చేపట్టిన హాత్ సే హాత్ జోడో పాదయాత్రకు మంచి స్పందన వస్తుందని మహేష్ అన్నారు. ఈనెల 9న కరీంనగర్ లో కాంగ్రెస్ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామన్న మహేష్ .. ఈ సభకు ముఖ్య అతిథిగా ఛత్తీస్ గఢ్ సీఎం భూపేశ్ భగేల్ హాజరుకానున్నారని చెప్పారు. రేవంత్ రెడ్డి పాదయాత్రలో భాగంగా కరీంనగర్ లో సభ ఏర్పాటు చేస్తున్నామని మహేష్ అన్నారు.