Renuka Chowdary: బీఆర్ఎస్ కు త్వరలోనే వీఆర్ఎస్ ఖాయం… రేణుకా చౌదరి
Congress leader Renuka Chowdary comments on KCR
కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి సీఎం కేసీఆర్ పై పలు ఘాటు విమర్శలు చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రిపై వస్తున్న ఆరోపణల గురించి రేణుకా చౌదరి ప్రముఖంగా ప్రస్తావించారు. ఖమ్మం జిల్లాకు చెందిన మీ మంత్రి దోపిడీ…దొంగతనలు తెలియడం లేదా? అక్కడ నిలువు దోపిడీ చేస్తున్నారంటూ రేణుకా చౌదరి ఆరోపించారు.
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని కూడా రేణుకా చౌదరి ప్రస్తావించారు. బిజెపి ఎమ్మెల్యే లను కొనుగోలు చేస్తుందని కేసీఅర్ అంటున్నారని, మరి ఖమ్మం జిల్లాలో ఆరు మంది ఎమ్మెల్యే లు కేసీఅర్ సత్య నారాయణ వ్రతం చేసి ప్రసాదం ఇస్తే వచ్చారా ? అని ప్రశ్నించారు.
జిల్లా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు లేవని రేణుకా చౌదరి మండిపడ్డారు. తెలంగాణ ను కేసీఅర్ సర్వ నాశనం చేశారని రేణుకా చౌదరి ఆరోపించారు. ఈ కొత్త సంవత్సరంలోనైనా కేసీఅర్ నిజాలు చెప్పడం అలవాటు చేసుకుంటారు అనుకుంటున్నానని అన్నారు. కేసీఆర్ తెలంగాణపై అమోఘమైన వ్యామోహం చూపిస్తున్నారని మండిపడ్డారు.
మోడీ, కేసీఆర్ దోస్తానా గురించి కూడా రేణుకా చౌదరి పలు ప్రశ్నలు సంధించారు. గతంలో మోడీకి ఎన్నో అంశాల్లో మద్దతు ప్రకటించిన కేసీఆర్ కు ప్రస్తుతం దేశంలో తాలిబాన్ పాలన కనిపిస్తుందా అని ప్రశ్నించారు.
ఈశాన్య మూల అని, మంచి జరుగుతుంది అని కేసీఅర్ ఖమ్మంలో కార్యక్రమాలు మొదలు పెట్టారని రేణుకా చౌదరి తెలిపారు.అలా చేస్తే ఖమ్మంలో ఉండే వారికి మాత్రమే మంచి జరుగుతుందనే విషయం కేసీఆర్ గుర్తు పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ నాలుకకి వెన్నుముక లేదని, కేసీఆర్ మాటలకు GST లేదని రేణుకా చౌదరి ఎద్దేవా చేశారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ అన్ని స్థానాలను ఖచ్చితంగా గెలుస్తుందని రేణుకా చౌదరి ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కు వీఆర్ఎస్ తప్పదని అన్నారు