తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఖరారుపై కసరత్తులు ప్రారంభించింది. గాంధీభవన్‌లో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది.
Telangana : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు(Telangana Assembly Elections) దగ్గరపడుతున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ(Congress Party) ఎమ్మెల్యే అభ్యర్థుల ఖరారుపై కసరత్తులు ప్రారంభించింది. గాంధీభవన్‌లో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(TPCC Chief Revanth Reddy) అధ్యతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే(Manik Rao Thackeray), రాష్ట్ర పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు వెయ్యికిపైగా ఆశావాహులు దరఖాస్తు చేసుకోవడంతో అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. అయితే, దాదాపు 40 స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలుస్తోంది. మిగతా స్థానాల్లో ఇద్దరు లేదా ముగ్గురు, అంతకంటే ఎక్కువ మంది పోటీ ఉండటంతో ఎన్నికల కమిటీ చర్చించింది. ఎంపిక కోసం మరోసారి భేటీ కావాలని నిర్ణయించింది.
ఇక దాదాపు ఖరారైన అభ్యర్థులు జాబితా ఇదే..?!
నల్గొండ జిల్లా(Nalgonda district)
నల్గొండ – కోమటిరెడ్డి వెంకటరెడ్డి
హుజూర్‌నగర్ – ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
కోదాడ – పద్మావతి
ఆలేరు – బీర్ల ఐలయ్య
హైదరాబాద్
నాంపల్లి – ఫిరోజ్ ఖాన్
జూబ్లీహిల్స్ – విష్ణువర్ధన్ రెడ్డి
రంగారెడ్డి జిల్లా
వికారాబాద్ – గడ్డం ప్రసాద్‌కుమార్
ఇబ్రహీం పట్నం – మల్‌రెడ్డి రంగారెడ్డి
పరిగి – టి రామ్మోహన్‌రెడ్డి
వరంగల్ జిల్లా(Warangal district)
నర్సంపేట – దొంతి మాధవరెడ్డి
వరంగల్ తూర్పు – కొండా సురేఖ
ములుగు – సీతక్క
భూపాలపల్లి – గండ్ర సత్యనారాయణ
మహబూబ్‌నగర్ జిల్లా
కొల్లాపూర్ – జూపల్లి కృష్ణారావు
కల్వకుర్తి – వంశీచంద్‌రెడ్డి
అచ్చంపేట – వంశీ కృష్ణ
షాద్‌నగర్ – ఈర్లపల్లి శంకర్
కొడంగల్ – రేవంత్‌రెడ్డి
అలంపూర్ – సంపత్‌కుమార్
మెదక్ జిల్లా
సంగారెడ్డి – జగ్గారెడ్డి
ఆందోల్ – దామోదర రాజనర్సింహ
జహీరాబాద్ – ఎ.చంద్రశేఖర్
నర్సాపూర్ – గాలి అనిల్‌కుమార్
ఆదిలాబాద్ జిల్లా(Adilabad district)
నిర్మల్ – శ్రీహరి రావు
మంచిర్యాల – ప్రేమ్‌సాగర్‌రావు
నిజామాబాద్ జిల్లా
జుక్కల్ – గంగారాం
కామారెడ్డి – షబ్బీర్‌అలీ
ఖమ్మం జిల్లా
మధిర – భట్టి విక్రమార్క
భద్రాచలం – పొదెం వీరయ్య
కొత్తగూడెం – పొంగులేటి శ్రీనివాసరెడ్డి
కరీంనగర్ జిల్లా(Karimnagar district)
మంథని- శ్రీధర్‌బాబు
వేములవాడ- ఆది శ్రీనివాస్
జగిత్యాల- జీవన్‌రెడ్డి
హుజురాబాద్- బల్మూరి వెంకట్
చొప్పదండి – మేడిపల్లి సత్యం
మానకొండూరు- కవ్వంపల్లి సత్యనారాయణ
రామగుండం – రాజ్‌ఠాకూర్
పెద్దపల్లి – విజయ రమణారావు
ధర్మపురి – లక్ష్మణ్
కోరుట్ల – జువ్వాడి నర్సింగ్ రావు