పార్టీ ప్రక్షాళనపై కాంగ్రెస్ కసరత్తు
పార్టీ ప్రక్షాళనపై కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది. పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇంఛార్జ్‌లతో కె.సి వేణుగోపాల్ భేటీ అయ్యారు. రాష్ట్రాల వారిగా సభ్యత్వ నమోదు, పార్టీ సంస్థాగత ఎన్నికలు, ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. మరోవైపు ఈ నెల 31తో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తి కానుంది. దీంతో రాష్ట్రాలలో ఎంత శాతం సభ్యత్వం నమోదైందనేదానిపై కూడా సమీక్షించనున్నారు. దీంతో పాటు దేశంలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరల పెంపుకు నిరసనగా చేపట్టాల్సిన దేశ వ్యాప్త ఉద్యమ కార్యాచరణపై కూడా చర్చించనున్పారు.
మరోవైపు ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. దీనిపై ఆయా రాష్ట్ర ఇంఛార్జిలతో చర్చించనున్నారు. పార్టీకి పునర్వైభవం తీసుకువచ్చేందుకు దోహదపడే అంశాలపై చర్చిస్తున్నారు.