Complaint for Beers: మా ఏరియాలో కింగ్ ఫిషర్ బీర్లు అమ్మడంలేదు..వారిపై చర్యలు తీసుకోండి
King Fisher beers: తెలంగాణ లో లిక్కర్ అమ్మకాలు ఎలా ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు. పండగల సమయాల్లోనే కాదు మాములు రోజుల్లో కూడా భారీగా లిక్కర్ అమ్మకాలు జరుగుతుంటాయి. ఈ అమ్మకాల వల్లే రాష్ట్ర ఖజానా నిండుతుందని చెప్పాలి.. లిక్కర్ అమ్మకాల్లో తెలంగాణాలో ఈ ఎనిమిదేళ్లలో దేశములోనే అగ్ర స్థానాన్ని అందుకుంది. కొందరైతే బ్రాండ్ల విషయంలో అస్సలు రాజీపడరు. తమకు ఈ బ్రాండ్ అయితేనే తాగుతామని పట్టుబడతారు. ఇది మరోసారి రుజువైంది. తమకు ఇష్టమైన మద్యం అందుబాటులో లేదని ఏకంగా కలెక్టర్ కే విన్నపించుకున్నాడు.
జగిత్యాలకు చెందిన బీరం రాజేష్ అనే వ్యక్తి ప్రజావాణిలో చేసిన ఫిర్యాదుపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. జగిత్యాల పట్టణంలోని వైన్స్ షాపులు సిండికేట్ అయి కింగ్ షిఫర్ బీర్లు అమ్మడం లేదని ప్రజావాణిలో కలెక్టర్ బీఎస్ లతకు ఫిర్యాదు చేశాడు. అయితే తన బాధ కొందరికి హాస్యాస్పదమైనప్పటికీ రోజువారి మద్యం తాగేవారికి యూరిస్ యాసిడ్ ప్రాబ్లం వస్తుందని అన్నాడు. జిల్లాలోని కోరుట్ల,ధర్మపురి మండలాల్లొ కింగ్ ఫిషర్ బీర్లు అమ్ముతున్నారు కానీ జగిత్యాలలో అమ్మట్లేదు అని యువకుడు తెలిపారు.
జగిత్యాల జిల్లాలో కల్తీ మద్యం, నాసిరకం బీర్లు అమ్ముతున్నారు. దీంతో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. జిల్లాలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఉన్నాయి. అందులో ఒక్కో బీర్‌కు రూ. 200 నుంచి 300 వరకు వసూలు చేస్తూ ప్రజల జేబులు కాలి చేస్తున్నారని అన్నారు. ఆ బెల్ట్ షాపులపై వెంటనే చర్యలు తీసుకోవాలిఅలాగే వైన్ షాపుల్లో దొరక్కుండా బెల్టు షాపులలో బీర్లు దొరుకుతున్నాయి. అయితే బెల్టు షాపుల్లో అమ్మేవి ఒరిజినలా? నకిలీవా? అనేది అర్ధం కావడం లేదన్నారు.
మద్యపానం చేసేవారు 20 నుంచి 30 కిలోమీటర్ల దూరం వెళ్లి నాణ్యమైనవి కొనుక్కొని వచ్చే క్రమంలో ప్రమాదానికి గురి కావడం జరుగుతుందన్నారు.. ధర్మపురిలో దొరికే కింగ్ ఫిషర్ జగిత్యాలలో ఎందుకు దొరకడం లేదంటూ కలెక్టర్ నే ప్రశ్నించాడు.. వేసవిని దృష్టిలో ఉంచుకుని బ్రాండెడ్ బీర్లను మద్యం షాపులలో విక్రయించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను అభ్యర్ధించాడు..