తెలంగాణలో తమ సామ్రాజ్యాన్ని మరింత విస్తరించేందుకు కోకాకోలా రెడీ అయింది. అదనపు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది.
Coca-Cola: తెలంగాణకు దిగ్గజ కంపెనీలు (Companies) తరలివస్తున్నాయి. ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబర్చుతున్నాయి. ఇప్పటికే గూగుల్, అమెజాన్, క్వాల్కమ్, ఫాల్కాన్‌తో పాటు మరికొన్ని కంపెనీలు తెలంగాణలో తమ కార్యాలయాలను ఏర్పాటు చేశాయి. దిగ్గజ సాఫ్ట్ డ్రింగ్ కంపెనీ కోకాకోలా (Coca-Cola) తెలంగాణలో తమ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఇప్పుడు తెలంగాణలో తమ సామ్రాజ్యాన్ని మరింత విస్తరించేందుకు కోకాకోలా రెడీ అయింది. అదనపు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది.
ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ (KTR).. కోకాకోలా ఉపాధ్యక్షుడు జేమ్స్ మేక్ గ్రివితో (James McGreevy) సమావేశమయ్యారు. తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని జేమ్స్ మేక్ గ్రివిని కేటీఆర్ కోరారు. ఇందుకు సంబంధించి ఇక్కడ ఉన్న వనరులు.. ప్రభుత్వం నుంచి అందివ్వనున్న సహకారం గురించి వివరించారు. ఆ తర్వాత తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెడుతామని జేమ్స్ మేక్ గ్రివి ప్రకటించారు.
తమ కంపెనీకి భారత్ మూడో అతిపెద్ద మార్కెట్ అని, తమ కార్యకలాపాలను విస్తరించే వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లు జేమ్స్ మేక్ గ్రివి వెల్లడించారు. ప్రస్తుతం సిద్ధిపేటలో రూ. 1,000 కోట్లతో బాలిటింగ్ ప్లాంట్ నిర్మాణాన్ని కోకాకోలా కంపెనీ ప్రారంభించింది. ఆ ప్లాంట్‌కు అదనంగా మరో రూ. 647 కోట్లు పెట్టనున్నట్లు జేమ్స్ తెలిపారు. ఆ ప్లాంట్ నిర్మాణం డిసెంబర్ 24లోగా పూర్తి అవుతుందని వెల్లడించారు. అంతేకాకుండా మరో తయారీ కేంద్రాన్ని కూడా తెలంగాణలో ఏర్పాటు చేస్తామని వివరించారు.
ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అలాగే కోకాకోలా కంపెనీకి ధన్యవాదాలు తెలియజేశారు. ప్రభుత్వం తరుపున రెండో తయారీ కేంద్రానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడించారు.
Cola Cola doubles down on its investment plans in Telangana!
✳️ Bolstered by the support from the Telangana government, Hindustan Coca Cola Beverages Pvt Ltd (HCCB) has committed an additional investment of Rs. 647 Cr in the greenfield plant which is under construction at Banda… pic.twitter.com/RqIKIxXO6j
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) August 26, 2023