Brs Meeting Food: అతిధులకు అదిరిపోయే వంటకాలు
Brs Meeting Food:ముఖ్యమంత్రి కేసీఆర్ తెరాస ను బిఆర్ఎస్ పార్టీ గా ప్రకటించిన తర్వాత తొలిసారి భారీ బహిరంగ సభ పెడుతుండడం తో అదికూడా ఖమ్మంలో నిర్వహిస్తుండడం తో దేశ వ్యాప్తంగా ఈ సభ పై ఉత్కంఠ నెలకొంది. ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా పక్కరాష్టంనుండి కూడా భారీగా జనం రానున్నారు. ఇక తెలుగు రాష్టాలనుండి పెద్ద ఎత్తున కార్య కర్తలు హాజరు కాబోతున్నారు. దీనికి సంబదించిన అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌మాన్, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ ఈ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. ఇందులో భాగంగానే.. అతిథులకు పసందైన విందు ఇవ్వనున్నారు. అందుకోసం సీఎం కేసీఆర్ దగ్గరుండి ప్రత్యేక వంటకాలను తయారుచేయిస్తున్నారంట. ఈ సభకు వచ్చే అతిథులకు ఘుమఘుమలాడే తెలంగాణ వంటకాల రుచి చూపించేందుకు.. మెనూ సిద్ధం చేశారు. మొత్తం 38 రకాల వంటకాలను సిద్ధం చేస్తున్నారు. వాటిలో 17 రకాల నాన్ వెజ్ ఐటెమ్స్, 21 రకాల వెజ్ వంటకాలు వండించనున్నారు. మటన్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ, కొరమీను కూర, తెలంగాణ మటన్ కూర, మటన్ కుర్మా , తలకాయ ఇగురు, నాటుకోడి కూర, అలాగే పనీర్ బటర్ మసాలా, మెతీ చమన్, దాల్ తడ్కా, బచ్చలకూర, మామిడికాయ పప్పు, బీరకాయ శనగపప్పు, వంటకాలను మొత్తం 500 మంది అతిథుల కోసం సిద్ధం చేస్తున్నారు. అలాగే సభకు వచ్చినవారు కూడా ఈ వంటకాల రుచులను చూడనున్నారు.