Revanth Reddy: ఇసుక మాఫియాను ప్రోత్సహిస్తున్న కేసీఆర్ ..రేవంత్ రెడ్డి
Revanth Reddy: ఇసుక మాఫియాలో సీఎం కేసీఆర్ కుటుంబానికి భాగస్వామ్యం ఉందని ఆరోపించారు. క్వారీల పేరుతో ఇసుక దోపిడీ పాల్పడుతున్నారని, ఒకే పర్మిషన్ మీద ఎక్కువ లారీల ఇసుక తరలిస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఉమ్మడి కరీనగర్ లో పాదయాత్ర చేస్తున్న ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు. కరీంనగర్ అంటే బిఆర్ఎస్ నాయకులకు ఒక ఆదాయవనరుగా చుస్తునారు తప్ప అభివృద్ధి అనేది లేకుండా చేస్తున్నారన్నారు. ఇసుక దోపిడీ ప్రజలకు చూపెట్టడానికి ఇక్కడకు వచ్చానన్నారు.
అక్రమ ఇసుక తరలించి కోట్లు కూడబెడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా జేసీబీలు వాడి అక్రమ ఇసుక తరలిస్తున్నారు. మొత్తం ప్రైవేట్ సామ్రాజ్యంగా మారి అక్రమ ఇసుక తరలిస్తున్నారన్నారు. అక్రమ ఇసుకపై ఫిర్యాదులు చేసిన వారిని ఇబ్బందులకు గురి చేసి దాడులకు పాల్పడుతున్నారన్నారు. ఇసుక మాఫియాను కేసీఆర్ ప్రోత్సహిస్తున్నాడని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇసుక దోపిడీని ప్రజలకు చూపించి కోర్టుకు వెళ్లి అక్రమ క్వారీలను మూసేసే వరకు పోరాటం కొనసాగిస్తుందన్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తుంటే స్థానిక శాసన సభ్యుడు, పార్లమెంట్ సభ్యుడు ఏం చేస్తున్నారు. ఎమ్మేల్యే, ఎంపీ ఎందుకు మౌనంగా ఉన్నాడని అన్నారు.