Bandi Sanjay: సీఎం కేసీఆర్ జబర్దస్త్ జోక్‌లు వేస్తున్నారు: బండి సంజయ్
CM KCR Jabardast joke: ఇటీవల భారీ వర్షాలు కురిసి, గోదావరికి వరద పోటెత్తడం వెనుక కుట్రకోణం ఉండొచ్చని తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అనూహ్య రీతిలో భారీ వర్షపాతం సంభవిస్తోందని, గోదావరి పరీవాహక ప్రాంతాల్లోనూ ఇలాగే క్లౌడ్ బరస్ట్‌కు పాల్పడి ఉంటారన్న అనుమానాలు తలెత్తుతున్నాయని తెలిపారు. గతంలో కశ్మీర్, లేహ్ ప్రాంతాల్లోనూ క్లౌడ్ బరస్ట్‌కు విదేశాల నుంచి కుట్ర జరిగిందన్న ప్రచారం ఉందని వివరించారు.
దీనిపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. భారీ వర్షాల వెనుక విదేశీ కుట్ర ఉందనడం ఈ శతాబ్దపు పెద్ద జోక్ అని అభివర్ణించారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్ ఈ డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ తప్పిదాలతోనే కాళేశ్వరం మునిగిపోయిందని విమర్శించారు. 10 వేల ఇళ్లతో కాలనీ, కరకట్ట నిర్మాణం పేరుతో మళ్లీ వంచించే హామీలు ఇస్తున్నారని అన్నారు. ప్రజలు కేసీఆర్ మాటలను నమ్మేంత అమాయకులు కారన్నారు. కేసీఆర్ ప్రగతి భవన్ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారన్న బండి సంజయ్ వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు తగిన రీతిలో బుద్ది చెబుతాని ఆయన జోస్యం చెప్పారు.