BRS Meeting @ Hyd: హైదరాబాద్ కు ఇద్దరు సీఎంలు..బీఆర్ఎస్ సభ
CM KCR Invites CM’s Stalin and Soren for New Secretariat Iingauartion: తెలంగాణ సచివాలయ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారు. కొత్త హంగులతో సిద్దమైన సచివాలయ ప్రారంభానికి కేసీఆర్ జన్మదినమైన ఫిబ్రవరి 17న ముహూర్తంగా ఖరారు చేసారు. ఇందు కోసం తమిళనాడు సీఎం స్టాలిన్, జార్ఖండ్ సీఎం సోరెన్ , అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ ను
ఆహ్వనించారు. సచివాలయం ప్రారంభం వేళ చండీయాగం నిర్వహించాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారు. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలనే డిమాండ్ నేపథ్యంలో ప్రకాశ్ అంబేద్కర్ ను ఆహ్వానించారు. అదే రోజు పెరేడ్ గ్రౌండ్స్ వేదికగా బీఆర్ఎస్ బహిరంగసభకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 18న ఖమ్మం వేదికగా బీఆర్ఎస్ ఆవిర్భావ సభ నిర్వహించారు.
ఆ సభకు ఆప్ ముఖ్యమంత్రులు కేజ్రీవాల్, భగవంత్ మాన్ సింగ్ తో పాటుగా కేరళ సీఎం విజయ్ హాజరయ్యారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ పాల్గొన్నారు. కేసీఆర్ జాతీయ స్థాయిలో ఇతర పార్టీ నేతలతో కలిసినా , వారంతా హాజరు కాకపోవటం పైన రాజకీయంగా విమర్శలు వచ్చాయి. కేసీఆర్ కు మిగిలిన నేతల మద్దతు లేదనే వాదన మొదలైంది. ఈ సమయంలో కేసీఆర్ తాజా నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ రెండో సభ ఫిబ్రవరి 5న నాందేడ్ లో జరగనుంది. ఆ సభను ఖమ్మం సభకు దీటుగా నిర్వహించాలని నిర్ణయించారు. ఆ తరువాత ఫిబ్రవరి 17న కేసీఆర్ జన్మదినం నాడు సచివాలయ ప్రారంభోత్సవంతో పాటుగా హైదరాబాద్ కేంద్రంగా భారీ బహిరంగ సభకు ఇద్దరు సీఎంలను ఆహ్వానించారు. ముఖ్యమంత్రులు స్టాలిన్, సోరెన్ బహిరంగ సభలో పాల్గొనటం ద్వారా బీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.
జాతీయ స్థాయిలో నాన్ కాంగ్రెస్ – నాన్ బీజేపీ పార్టీల వేదికగా పోరాటం సాగుతుందని కేసీఆర్ ప్రకటిస్తున్న వేళ..ఈ ఇద్దరు సీఎంల హాజరు కొత్త చర్చకు ఆస్కారం ఇస్తోంది. స్టాలిన్ నాయకత్వంలోనూ డీఎంకే యూపిఏలో భాగస్వామిగా ఉంది. కేసీఆర్ గతంలో తమిళనాడు ..జార్ఖండ్ రాష్ట్రాలకు వెళ్లి ఇద్దరు ముఖ్యమంత్రులతో భేటీ అయ్యారు. బీఆర్ఎస్ ఏర్పాటు..మద్దతు పైన చర్చలు చేసారు. ఇప్పుడు కేసీఆర్ ఆహ్వానం మేరకు ఆ ఇద్దరు సీఎంలు హైదరాబాద్ రానున్నారు.