CM Kcr: భారత్ లో అఫ్ఘానిస్థాన్ పాలనా రావచ్చు..కేసీఆర్
CM Kcr: మహహబూబాద్ జిల్లా కేంద్రంలో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అంతకుముందు కార్యాలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత కార్యాలయాన్ని ప్రారంభించి, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం భద్రాద్రి కొత్తగూడెంలో పర్యటించారు కలెక్టరేట్ ప్రాంగణానికి సీఎం చేరుకోగా.. పోలీసుల నుంచి గౌరవ వందనం సమర్పించారు. ఆ తర్వాత కలెక్టరేట్ శిలాఫలకాన్ని ప్రారంభించారు. పూజా కార్యక్రమాల అనంతరం చాంబర్‌లో కలెక్టర్ అనుదీప్‌ను కుర్చీలో కూర్చుండబెట్టి శుభాకాంక్షలు తెలిపారు.
కెసిఆర్ మాట్లాడుతూ.. కొత్తగూడెం జిల్లా ఏర్పాటు చేసుకోవడమే కాకుండా పరిపాలన భవనాన్ని నిర్మించుకున్నాం. నూతన కలెక్టరేట్‌ను నా చేతుల మీదుగా ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. ఇక నుంచి మంచి ప్రజా కార్యక్రమాలు జరిగి, ఈ జిల్లా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి. కొత్తగూడెంకు కొత్త కలెక్టరేట్, మెడికల్ కాలేజీ వచ్చింది. థర్మల్ పవర్ ప్లాంట్ వచ్చిందని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు రాజకీయ లబ్ధి కోసం కుల, మత విద్వేషాలను రెచ్చగొడుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే, భారత్ తాలిబాన్ల పాలనలోని అఫ్ఘానిస్థాన్‌లా మారినా ఆశ్చర్యం లేదని అన్నారు.
దేశాన్ని రక్షించుకునే విషయంలో విజ్ఞులైన ప్రజలు మరింతగా ఆలోచన చేయాలన్నారు. నదీ జలాల సమస్యను నాడు కాంగ్రెస్, నేడు బీజేపీ ప్రభుత్వాలు పరిష్కరించకుండా రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టి చోద్యం చూస్తున్నాయని ఆరోపించారు. ట్రైబ్యునళ్ల న్యాయమూర్తులు సత్వరం తీర్పులు ఇచ్చే పరిస్థితిలో లేరని, జల వివాదాలు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంచితే రైతుల కష్టాలు ఎప్పుడు తీరుతాయని ప్రశ్నించారు.
33 జిల్లాలకు 33 మెడికల్ కాలేజీలను మంజూరు చేసుకున్నాం అని కేసీఆర్ వెల్లడించారు. అందులో భాగంగానే కొత్తగూడెంకు మెడికల్ కాలేజీ వచ్చింది. ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ప్రజలు డిమాండ్, ధర్నాలు చేయకుండానే కొన్ని కార్యక్రమాలు అమలు చేస్తున్నాంఅని పేర్కొన్నారు.