Jayashankar Bhupalpally: భూపాలపల్లి బీఆర్ఎస్‌లో ముదురుతున్న వర్గ విభేదాలు
Jayashankar Bhupalpally: రామప్ప ఆలయాన్ని సందర్శించుకున్నఎమ్మెల్సీ కవిత భూపాలపల్లిలో జరిగిన బొగ్గు గని కార్మికుల సంఘం కొత్త భవనం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ సింగరేణి అంటే వెలుగులకోసం కేవలం బొగ్గు తీయడమే కాదని.. విద్యుత్ ఉత్పత్తి కూడా మనమే చేస్తున్నామని నిరూపిస్తున్న ఘనత తెలంగాణదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణిని ప్రయివేటు పరం చేయాలని చేస్తున్నారని పేర్కొన్నారు. ఒకవేళ అదే జరిగితే తెలంగాణ లో సింగరేణిని కాపాడుకుంటామన్నారు. నాయకుడు అంటే ప్రజలగుండెల్లో ఉండాలి అలాంటి వ్యక్తి నాయకుడు కేసీఆర్ అని చెప్పారు. వారసత్వ ఉద్యోగాలు అడ్డుకున్న వారు ఎవరో కార్మికలోకం ప్రజలకు తెలిపాలన్నారు.
ఇది ఇలావుండగా భూపాలపల్లిలో తెలంగాణ బొగ్గు గని కార్మికుల సంఘం కొత్త భవనం ప్రారంభోత్సవంలో బీఆర్ఎస్‌లో వర్గ విబేధాలు బయటపడ్డాయి. ఎమ్మెల్సీ కవిత ముందట ఒకరినొకరు తిట్టుకున్నారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం భవనంలో శిలాఫలకంలో ఎమ్మెల్సీ మధుసూదనాచారి పేరు అలాగే జడ్పీ ఛైర్పర్సన్ శ్రీ హర్షిని పేరు లేదని ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గండ్ర వెంకటరమణారెడ్డి బీఆర్ఎస్ లో వర్గ విభేదాలు సృష్టించే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అనుచరులు పోటాపోటీగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. ఎమ్మెల్సీ కవిత సద్దిచెపటంతో వివాదం ముగిసింది.