మోదీని గద్దె దించడానికి ఎంత డబ్బు అయిన ఖర్చు చేస్తానని కేసీఆర్ అంటున్నారని.. ఆ డబ్బు ఎవరిదో తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలని అన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. బీజేపీ హైదరాబాద్ జిల్లా కార్యవర్గ సమావేశం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ హాజరయ్యారు.
Kishan Reddy: మోదీని గద్దె దించడానికి ఎంత డబ్బు అయిన ఖర్చు చేస్తానని కేసీఆర్ అంటున్నారని.. ఆ డబ్బు ఎవరిదో తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలని అన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. బీజేపీ హైదరాబాద్ జిల్లా కార్యవర్గ సమావేశం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ హాజరయ్యారు. ఈ సందర్బంగా కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసాడు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ను ఎంఐఎం పార్టీ నడిపిస్తోందని, మహారాష్ట్రలో ఒక వార్డ్ మెంబర్ గెలిచినందుకే సంబుర పడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్కు బీజేపీనే ప్రత్యామ్నాయం అని అన్నారు
రాబోయే ఎన్నికల్లో తెలంగాణాలో కాషాయ జెండా ఎగురవేస్తామని అన్నారు. కేసీఆర్ కుటుంబం చేయని అవినీతి లేదన్నారు. కర్ణాటకలో ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు కాంగ్రెస్ మూడు రోజుల సమయం తీసుకుందని వీళ్లు దేశంలో అన్ని పార్టీలతో కలిసి కేంద్రంలో అధికారంలోకి వస్తారట అని జోస్యం చెప్పారు. ఇక కర్ణాటకలో ఎన్నికల్లో జరిగిన పరాభవం తెలంగాణాలో కూడా అవుతుందని కొందరంటున్నారు..కానీ తెలంగాణ లో బిఆర్ఎస్ పార్టీకి ఓటమి తప్పదని అన్నారు. మేమంతా ఒక కుటుంబం..కానీ తెలంగాణ లో కుటుంబపాలన కొనసాగుతుందని అన్నారు. దేశాబివృది జరగాలంటే ఒక్క బీజేపీతో మాత్రమే అవుతుందని అన్నారు. బీజేపీ మాత్రమే సమర్థవంతమైన పాలన అందిస్తుందని స్పష్టం చేశారు.