సాయి గణేష్ ఆత్మహత్య కేసులో సీబీఐ విచారణ..నేడు కోర్టు కీలక తీర్పు ?
ఖమ్మం జిల్లాకు చెందిన బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్య కేసుపై హైకోర్టు నేడు కీలక తీర్పు వెళ్లడించనుంది ? సాయి గణేష్ సూసైడ్‌పై గతంలో బీజేపీ వేసిన పిటీషన్‌ను విచారించిన న్యాయస్థానం ఈ కేసులో మంత్రి పువ్వాడ అజయ్‌తో సహా మరో ఆరుగురికి నోటీసులు జారీ చేసింది. యువకుడి మృతిపై వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. నేటితో కోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో న్యాయస్థానం విచారణ చేపట్టనుంది.
మరోవైపు బీజేపీ నేతలు న్యాయస్థానం ఈ కేసును రాష్ట్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించవద్దని కోరారు. రాష్ట్ర దర్యాప్తు సంస్థలకు ఈ కేసును అప్పగిస్తే అసలు నేరస్తులు తప్పించుకునే ప్రమాదం ఉందని, యువ నాయకుడి మృతికి కారణమైన వారికి కఠిన శిక్ష పడాలంటే కోర్టు సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతున్నారు. దీంతో న్యాయస్థానం నేడే తుది తీర్పు వెళ్లడిస్తుందా లేదా అనేది చూడాలి మరి.