Lakshmi Narayana: స్టూడెంట్స్ పై మాజీ జేడీ లక్ష్మీ నారాయణ ఆగ్రహం
Lakshmi Narayana: నల్గొండలో జనగణమన ఉత్సవసమితి నిత్య జాతీయ గీతాలాపన ద్వితీయ వార్షికోత్సవంలో సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ విద్యార్థులపై ఆగ్రహం వ్యక్తం చేసాడు. ముఖ్య అతిధి సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ పాల్గొన్న జనగణమన ఉత్సవ సమితి అధ్యక్షులు కర్నాటి విజయ్ కుమార్, కమిటీ సభ్యులు సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో దేశం గురించి ఓ అమ్మాయి ప్రసంగిస్తుంటే అక్కడున్న కొంతమంది విద్యార్థులు చేసిన పనికి లక్ష్మీనారాయణ మండిపడ్డారు.
ఓ విద్యార్థిని దేశ సమగ్రత గురించి ప్రసంగిస్తున్న సమయంలో..విద్యార్థుల్లో ఉన్న కొందరు కామెంట్లు చేస్తూ.. న్యూసెన్స్ క్రియేట్ చేశారు. ఆ అమ్మాయి ప్రసంగానికి అడ్డం తగులుతూ పలు కామెంట్స్ చేసారు దీంతో స్టేజీపైన ఉన్న లక్ష్మీనారాయణ సహనం కోల్పోయారు. ఎవడ్రా వాడు, దమ్ముంటే బయటికి రారా.. సిగ్గు, శరం లేకుండా కూర్చున్నారు.. అంటూ విద్యార్థుల మీద నిప్పులు చెరిగారు. ఒక అమ్మాయి వచ్చి మన ముందు మాట్లాడుతుంటే.. పిల్లికూతలు కూస్తున్నారు వారికి బయటకు తోసేయండని సీరియస్ అయ్యారు. అమ్మాయిల వెనుక లైన్ లో కూర్చున్న వారిలోనే ఆ వెధవలు ఉన్నారు. ఆ హెయిర్ స్టైల్, మీరూ విద్యార్థుల్లా ఉన్నార్రా మీరు. ఏం సాధించారని అరుస్తున్నారు అంటూ మండిపడ్డారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మాజీ జేడీ లక్ష్మీనారాయణను అంతా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. సెల్యూట్ చెబుతున్నారు.