BRS Public Meeting: ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ
BRS Public Meeting: ఖమ్మంలో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. టీఆర్‌ఎస్ నుంచి జాతీయ పార్టీ బీఆర్‌ఎస్‌గా రూపాంతరం చెందిన తర్వాత సొంతగడ్డ తెలంగాణపై నిర్వహిస్తున్న తొలి సభ ఇదే. పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం వేదికగా జాతీయ రాజకీయాల కార్యాచరణను ప్రకటించనున్నారు. బహిరంగసభకు సీఎం కేసీఆర్, మరో ముగ్గురు ముఖ్యమంత్రులు, ఒక మాజీ సీఎం, సీపీఐ, సీపీఎం పార్టీల ప్రముఖ నేతలు హాజరుకానున్నారు.
కేరళ సీఎం విజయన్‌ను సన్మానించిన సీఎం కేసీఆర్
విజయన్‌కు జ్ఞాపిక బహూకరించిన సీఎం కేసీఆర్
కేంద్ర వైఖరితో రాజ్యాంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది
ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ అనేక చర్యలు చేపడుతోంది
కేంద్రంపై పోరాడేందుకు కేసీఆర్ నడుం బిగించారు
తెలంగాణ తరహాలోనే కేరళ కూడా అనేక పథకాలు చేపట్టింది
తెలంగాణ పోరాటాల పురిటిగడ్డ
తెలంగాణ సాయుధ పోరాటం భూసంస్కరణలకు కారణమైంది
స్వాతంత్ర్య సమరంలో పాల్గొనని శక్తులు కేంద్రంలో అధికారంలో ఉన్నాయి
కార్పొరేట్ శక్తులకే కేంద్రం ఊతమిస్తోంది
కేంద్ర వైఖరితో లౌకికత్వం ప్రమాదంలో పడుతోంది
సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేందుకు కేంద్రం యత్నిస్తోంది
వన్ నేషన్-వన్ ట్యాక్స్, వన్ నేషన్ -వన్ ఎలక్షన్ వంటి నినాదాలు సమాఖ్య నిర్మాణాన్ని దెబ్బతీస్తున్నాయి
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ సంయుక్తంగా దేశాన్ని పాలిస్తున్నాయి
రాష్ట్రాల హక్కులను కేంద్రం కబళిస్తోంది
సమాఖ్య స్ఫూర్తి, ప్రజాస్వామ్యాన్ని కేంద్రం దెబ్బతీస్తోంది
పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని బీజేపీ అపహాస్యం చేస్తోంది
ఖమ్మంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం అయింది. 4 రాష్ట్రాల సీఎంల చేతుల మీదుగా కంటివెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి కంటి పరీక్షలు ప్రభుత్వం నిర్వహించనున్నది. కంటివెలుగు కార్యాక్రమాన్ని ప్రారంభించిన సీఎంలు కేసీఆర్, కేజ్రీవాల్, పినరయి విజయన్, భగవంత్ మాన్ కళ్లద్దాలు అందజేశారు.
ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ బహిరంగ సభ కంటే ముందు ఖమ్మం సమీకృత కలెక్టరేట్ భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో కేజ్రీవాల్, భగవంత్‌మాన్, కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న పినరయి విజయన్, అఖిలేశ్, సీపీఐ నేత డి.రాజా కూడా పాల్గొనారు.
ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ బహిరంగ సభ వేదికపై నలుగురు సీఎంలు, జాతీయ నేతలు పాల్గొననున్నారు. ఈ సభకు దిల్లీ, పంజాబ్, కేరళ సీఎంలు హాజరవగా సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా కూడా హాజరయ్యారు. ఈ ఆవిర్భావ సభకు భారీగా నేతలు, పార్టీ శ్రేణులు చేరుకుంటున్నారు. ఖమ్మం నూతన కలెక్టరేట్ వెనుక 100 ఎకరాల స్థలంలో సభ జరుగుతూ ఉండగా 16 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి భారీగా జన సమీకరణ చేశారు.
ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభలో పాల్గొనడం జరిగింది. #BRSParty #CMKCR #PRR #Kammambrspartysabha pic.twitter.com/dSu1tgwA16
— Pilot Rohith Reddy (@PilotRohith) January 18, 2023
ప్రెసిడెన్షియల్ సూట్ నుండి హెలిపాడ్ కు చేరుకుని రెండు హెలికాప్టర్లలో యాదగిరి గుట్ట నుంచి ఖమ్మం బయలుదేరిన ముఖ్యమంత్రులు, అగ్ర నేతలు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో పలువురు ముఖ్యమంత్రులు, అగ్ర నేతలు శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. ప్రధాన ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రులు , అగ్ర నేతలకు ఆలయ త్రితల రాజగోపురం వద్ద అర్చకులు , వేద పండితులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అగ్ర నేతలు ఆంజనేయ స్వామి సన్నిధి వద్ద హారతి తీసుకున్నారు. మూల విరాట్ స్వయంభు శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ప్రధాన అర్చకులు , వేద పండితులు సంకల్పం , సువర్ణ పుష్పాలతో అర్చన నిర్వహించారు. హారతి , తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం అర్చకులు , వేద పండితులు మంత్రోచ్ఛరణలతో వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను నేతలు తిలకించారు. ఈ క్రమంలో ఆలయ ప్రాశస్త్యం , ఆధునీకరించిన విధానం గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇతర సీఎంలు, నేతలకు వివరించారు. ఆ అనంతరం ఆలయం నుండి ప్రెసిడెన్షియల్ సూట్ కు ముఖ్యమంత్రులు , అగ్ర నేతలు చేరుకున్నారు.
బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ @ ఖమ్మం
భరత జాతికి ప్రగతి దారి బీఆర్ఎస్ జాతీయభేరి 💥💥#BRS #KCR @KTRTRS @DharmareddyTRS @krishanKTRS @PPR_CHALLA pic.twitter.com/1YFGFEXOfx
— Poshala Praveen Goud (@PraveenPoshala) January 18, 2023
యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకున్న ముగ్గురు ముఖ్యమంత్రులు, ఒక మాజి ముఖ్యమంత్రి & ఎందరో ఉన్నత అధికారులు
Kcryadadri
ఇద్దరు ఆప్ ముఖ్యమంత్రులు, ఒక వామపక్ష ముఖ్యమంత్రి సహా తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన సభకు పెద్ద ఎత్తున నేషనల్ కవరేజ్ ఉండేలా చూసుకుంటున్నారు. జాతీయ స్థాయిలో సత్తా చాటాలని చూస్తున్న కేసీఆర్ అండ్ కో ఈ మేరకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది.
Cmkcr13
ముఖ్యమంత్రులతో కలిసి యాదాద్రి చేరుకున్న వామపక్ష నేతలు దేవుడి దర్శనానికి రాలేదు. కేరళ సీఎం విజయన్, సీపీఐ నేత రాజా గెస్ట్ హౌస్ లోనే ఉండిపోయారు. సీఎం కేసీఆర్ తో పాటుగా ఆప్ ముఖ్యమంత్రులు ఇద్దరూ కేజ్రీవాల్, భగవంత్ మాన్ సింగ్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదాద్రి దేవాలయంలో లక్ష్మీనర్సింహ స్వామిని దర్శించుకున్నారు. దేవాలయ సందర్శన పూర్తయిన తరువాత నేతలంతా కలిసి ప్రత్యేక హెలికాఫ్టర్లలో ఖమ్మం చేరుకోనున్నారు.
యాదాద్రి లక్ష్మీ నరసింహ దేవాలయంలో ముఖ్యమంత్రులకు మహా పూర్ణకుంభంతో ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దేవాలయంలో నిర్మాణాలను ముఖ్యమంత్రులు పరిశీలించారు. సీఎం కేసీఆర్ వారికి ఆ నిర్మాణాల ప్రత్యేకతలను వివరించారు. ఎమ్మెల్సీ కవితతో పాటుగా మంత్రులు, పార్టీ నేతలు ముఖ్యమంత్రులతో పాటుగా లక్ష్మీ నర్సింహ స్వామిని దర్శించుకున్నారు.
ఖమ్మం సభకు హాజరు కావటం ద్వారా జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ తో ఆప్ పొత్తు పైన చర్చ మొదలైంది. మద్దతుగా మాత్రమే నిలుస్తారా, పొత్తు కుదర్చుకుంటారా అనేది చర్చ. తెలంగాణలో ఇప్పటికే వామపక్ష పార్టీలతో బీఆర్ఎస్ పొత్తు కుదిరింది. జాతీయ స్థాయిలోనూ కొనసాగుతుందని రెండు పార్టీల నేతలు ప్రకటించారు. ఆప్ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ తో తెలంగాణలో పొత్తుకు సిద్దం అవుతుందా లేదా అనే దాని పైన తెలంగాణ ఆప్ నేతలు కేజ్రీవాల్ తో చర్చించారు. సరైన సమయంలో నిర్ణయం తీసుకుందామంటూ కేజ్రీవాల్ సమాధానమిచ్చారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటుగా కేరళ సీఎం పినయి విజయన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్, అఖిలేష్ యాదవ్, డి రాజా యాదాద్రి చేరుకున్నారు. యాదాద్రీశుడిని దర్శించుకున్న తరువాత దేవాలయం మొత్తం సందర్శించనున్నారు. ఆ తరువాత యాదాద్రి నుంచి ఖమ్మం కు హెలికాప్టర్ లో చేరుకుంటారు. నలుగురు ముఖ్యమంత్రులు, ముఖ్య నేతల ఆలయ సందర్శనం వేళ భారీ బందో బస్తు ఏర్పాటు చేసారు. సాధారణ భక్తుల దర్శనాలను నిలిపి వేశారు.
ఖమ్మం సభ కోసం విచ్చేసిన ముగ్గురు ముఖ్యమంత్రులు, జాతీయ నేతలకు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో అల్పాహార విందు ఇచ్చారు. ముఖ్యమంత్రులు కేజ్రీవాల్, భగవంత్ మాన్ సింగ్, విజయ్ పినరయితో పాటుగా యూపీ మాజీ సీఎం అఖిలేష్, సీపీఐ నేత డీ రాజా ఉన్నారు. వీరంతా రెండు హెలికాఫ్లర్లలో బేగంపేట నుంచి యాదాద్రికి బయల్దేరి వెళ్లారు. అక్కడ దర్శనం తరువాత ఖమ్మంలో నిర్ణయించిన కార్యక్రమాలకు హాజరవుతారు.
ప్రగతి భవన్ ను కేసీఆర్ తో సహా అతిధులుగా వచ్చిన ముగ్గురు ముఖ్యమంత్రులు యాదాద్రికి బయల్దేరారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేకంగా సిద్దం చేసిన రెండు హెలికాప్టర్లలో వీరు యాదాద్రి చేరుకుంటారు. అక్కడ ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. యాదాద్రి ప్రత్యేకతలను ముగ్గురు సీఎంలకు కేసీఆర్ వివరించనున్నారు.
బీఆర్ఎస్ సభకు వచ్చే వారి కోసం ప్రత్యేక వంటకాలు సిద్దం అయ్యాయి. ముఖ్య నేతలతో పాటుగా కార్యకర్తలకు భోజనాలు ఏర్పాట్లు చేస్తునక్నారు. అందులో ప్రత్యేకంగా నిపుణులను రప్పించారు 64 రకాల వెజ్, నాన్ వెజ్ వంటకాలు సిద్దం చేసారు. నలుగురు ముఖ్యమంత్రులు కలెక్టరేట్ ప్రారంభం తరువాత అక్కడే భోజనం చేసుకొని సభా వేదిక వద్దకు రానున్నారు.
ఖమ్మం బీఆర్ఎస్ సభకు ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాల నుంచి అభిమానులు తరలి వెళ్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ లో చేరిన ఏపీ నేతలు వీరిని ఖమ్మంకు తీసుకెళ్లే బాధ్యతలను తీసుకున్నారు. గుంటూరు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో ఖమ్మం కు తరలి వెళ్తున్నారు. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఫ్లెక్సీలతో వీరు బయల్దేరారు.
70 ఎకరాల స్థలంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. 140 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పుతో వేదిక సిద్దం అయింది. వేదికపై 200 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేసారు. 5 లక్షల మందిని తరలించేలా సన్నాహాలు మొదలయ్యాయి. 5,200 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు. సభా ప్రాంగణంలో 50 ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. 448 ఎకరాల్లో 23 చోట్ల పార్కింగ్ సౌకర్యం కల్పించారు.
బీఆర్ఎస్ ఆవిర్భావ సదస్సు వేదికగా ఖమ్మం ఇప్పుడు జాతీయ రాజకీయాలకు వేదిక కానుంది. ఈ సభ ద్వారా కేసీఆర్ రాజకీయంగా కీలక ప్రసంగం చేయనున్నారు. బీజేపీతో పోరాటం, కాంగ్రెస్ తో మైత్రి.. కలసొచ్చే పార్టీలతో ప్రయాణం పైన కేసీఆర్ క్లారిటీ ఇవ్వనున్నారు.
బీఆర్ఎస్ కోసం ఆరు రాష్ట్రాల్లో కార్యవర్గాలను కేసీఆర్ ఖరారు చేసారు. అనుబంధ విభాగాలను ఎంపిక చేసారు. ఖమ్మం సభలో ఆరు రాష్ట్రాలకు చెందిన బీఆర్ఎస్ కార్యవర్గాలు, అదే విధంగా అనుబంధ సంఘాల బాధ్యులను కేసీఆర్ ప్రకటించనున్నారు.
బీఆర్ఎస్ సభకు ఆప్, సీపీఐ, సమాజ్ వాదీ, సీపీఎం పార్టీల నేతలు మద్దతు ప్రకటించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన నేతలు హాజరవుతారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. కర్ణాటక ఎన్నికల షెడ్యూల్ ఎన్నికల నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి హాజరు కావటం లేదని తెలుస్తోంది.
బీఆర్ఎస్ ఆవిర్బావం నుంచి కేసీఆర్ కు తమిళనాడుకు చెందిన వీసీకే పార్టీ మద్దతుగా నిలుస్తోంది. ఖమ్మంలో జరుగుతున్న ఆవిర్భాబ సభలో బీఆర్ఎస్ లో వీసీకే పార్టీ అధికారికంగా విలీనం కానుంది.
బీఆర్ఎస్ ఆవిర్భావ సభ ద్వారా జాతీయ అజెండా ప్రకటించేందుకు కేసీఆర్ సిద్దమయ్యారు. నాన్ బీజేపీ..నాన్ కాంగ్రెస్ పార్టీలతో కలిసి ఐక్యత ప్రకటించేందుకు ఈ సభ వేదిక కానుంది. జాతీయ రాజకీయాల పైన కేసీఆర్ కీలక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.
సీఎం కేసీఆర్ తో పాటుగా అతిధులుగా వచ్చిన ముగ్గురు సీఎంలు రెండు హెలికాఫ్టర్లతో మొదట యాదాద్రికి వెళ్తారు.దర్శనం తర్వాత నేరుగా ఖమ్మం చేరుకుని.. కలెక్టరేట్ తో పాటు రెండో విడద కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఆ తరువాత ఖమ్మం సభా ప్రాంగణానికి చేరుకుంటారు.
ప్రగతి భవన్ లో సీఎం లు కేరళ సీఎం పినరయి విజయన్,కేజ్రీవాల్, భగవంతు మాన్ భవన్ లో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్. బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ లో సీపీఐ రాజా, అఖిలేష్ యాదవ్ హాజరు.
ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు సర్వం సిద్దం. అయిదు లక్షల మంది హాజరు అవుతారని అంచనా. వంద ఎకరాల్లో ఏర్పాట్లు.