Khammam Politics: 18న అమిత్ షాతో పొంగులేటి భేటీ – రూట్ క్లియర్
BRS leader from Khammam Ponguleti will meet Amit shah on January 18
బీఆర్‌ఎస్ సీనియర్ నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి పక్కా వ్యూహంతో వ్యవహరిస్తున్నారు. బీజేపీలో చేరేందుకు చకచకా అడుగులు వేస్తున్నారు. ఇటీవలే పొంగులేటి శ్రీనివాస రెడ్డి చేసిన పలు ప్రసంగాలు తన ఉద్దేశ్యాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసేందుకు తన అనుచరులకు అవకాశం కల్పిస్తానని భరోసా ఇస్తున్నారు. ఈ నెల 18న హోం మంత్రి అమిత్ షాను కలవనున్నారు. తన ఉద్దేశ్యాన్ని చాటనున్నారు.
నియోజకవర్గాల వారీగా మద్దతు దారులతో ఇటీవలే సమావేశం నిర్వహించారు. భారీ బహిరంగ సభలో బీజేపీలో చేరేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 18న ఖమ్మం వేదికగా కేసీఆర్ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. అదే రోజున పొంగులేటి అమిత్ షాతో భేటీ కానుండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల కోలాహలం మొదలయింది. రానున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రధాన రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్నాయి. గెలుపు వ్యూహాలను రచిస్తున్నాయి. అందివచ్చిన అన్ని మార్గాలను అన్వేషిస్తున్నాయి. పక్కా వ్యూహంతో ముందకు కదులుతున్నాయి. పలు పార్టీలకు చెందిన నేతలు కూడా తమను ఆదరించే పార్టీలవైపే చూస్తున్నాయి. తమతో పాటు తమ అనుచరులకు ప్రాధాన్యమిచ్చే పార్టీలకే జై కొడుతున్నాయి.