మహారాష్ట్రపై ప్రత్యేకంగా గురి పెట్టిన కేసీఆర్ ఆ లక్ష్యం దిశగా అడుగులేస్తున్నారు
BRS IN MAHARASTRA: మహారాష్ట్రలో BRS పార్టీ బోణీ కొట్టింది. గురువారం జరిగిన మహారాష్ట్ర (Maharastra) గ్రామ పంచాయతీ (Grama Panchayat)ఎన్నికల్లో (Elections) బీఆర్ఎస్ (BRS) పార్టీ అభ్యర్థి (Candidate) రాష్ట్రంలో మొదటి విజయం సాధించారు. రాష్ట్ర రాజకీయాల్లోకి ఈ మధ్యే అడుగుపెట్టిన బీఆర్ఎస్ (BRS)కు ఇది తొలి విజయం (First Victory) సాధించింది. ఛత్రపతి సంభాజీనగర్ ఛత్రపతి శంభాజీ నగర్ గ్రామపంచాయతీ ఉప ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. గంగాపూర్ తాలూకా అంబేలోహల్ గ్రామంలో జరిగిన గ్రామపంచాయతీ ఉప ఎన్నికలో BRS అభ్యర్థి విజయం సాధించారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థి గఫార్ సర్దార్ పఠాన్ గెలుపొందారు. గత నెలలో ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ జరిగింది. బీఆర్ఎస్ (BRS) పార్టీని జాతీయ స్థాయికి చేర్చేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముందు ఆయన పలు మార్లు సమావేశాలు నిర్వహించారు. ఎన్నికల్లో పోటీ చేయాలన్న నిర్ణయంతో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా రంగంలోకి దిగారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గఫర్ సర్దార్ పఠాన్ 115 ఓట్ల తేడాతో విజయం సాధించాడు.
అప్పటి దాకా పోరు ఆగదు..
దేశంలో రైతాంగం బాగుపడే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆగదన్నారు ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్
. మహారాష్ట్రలోని నాందేడ్‌లో బీఆర్ఎస్ పార్టీ శిక్షణ శిబిరాన్ని సీఎం కేసీఆర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. రాష్ట్రం వెలుపల తొలిసారిగా
ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరంలో కేసీఆర్ పాల్గొన్నారు. జెండాను ఆవిష్కరించిన కేసీఆర్ మహనీయుల చిత్రపటాలకు నివాళులర్పించారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు దాటినా దేశంలో సమస్యలు పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నదేశాలైన సింగపూర్, మలేషియా గొప్పగా అభివృద్ధి చెందాయని మెచ్చుకున్నారు. మహారాష్ట్ర, తెలంగాణ మధ్య ఒక ప్రత్యేక అనుబంధం ఉందని, రెండు రాష్ట్రాలు వేల కిలోమీటర్ల మేర సరిహద్దును పంచుకుంటున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనతికాలంలోనే అనేక సమస్యలను పరిస్కరించుకున్నామని, కృష్ణా, గోదావరి నదులు పుట్టిన మహారాష్ట్రలో నీటి కొరత ఎందుకని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో ఇంటింటికి పుష్కలంగా తాగునీరు అందిస్తున్నామని, మహారాష్ట్రలో పలుచోట్ల వారానికి ఒకసారి మాత్రమే తాగునీరు వచ్చే దుస్థితి ఉందని సీఎం గుర్తుచేశారు. కరువుతో అల్లాడిన తెలంగాణ నేడు దేశంలో అత్యధిక ధాన్యం పండిస్తున్నదని, రైతుబంధు సాయం నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతుందని చెప్పారు. దశాబ్దాలపాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ దేశానికి చేసిందేమీ లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. తెలంగాణలో సాధ్యమైన అభివృద్ధి ఇతర రాష్ట్రాల్లో ఎందుకు కావడం లేదని ప్రశ్నించారు. దేశంలో రైతులు ఎప్పుడూ పోరాటం చేయాల్సిన దుస్థితి ఎందుకని నిలదీశారు. దేశమంతటా ఒక మార్పు తేవాలనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందన్నారు. దేశ రైతాంగం బాగుపడే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆగదని చెప్పారు.