Boy Died: కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయిన మరో బాలుడు
Boy Died: తెలంగాణలో కుక్కల దాడిలో మరో బాలుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన సంచలనంగా మారింది. ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం పుటనీ తండాకు చెందిన ఐదేళ్ల భరత్ మీద నిన్న సాయంత్రం వీధి కుక్కలు దాడి చేశాయి. ఇంటి ముందు ఆడుకుంటున్న భరత్ మీద పడి కుక్కలు గాయపరిచాయి. కూలి పనులకు వెళ్లి వచ్చిన తల్లిదండ్రులు.. భరత్ను గమనించి అప్పుడు ఖమ్మంలోని ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. మెరుగైన వైద్యం కోసం ఆర్టీసీ బస్సులో హైదరాబాద్కు తీసుకువస్తుండగా మార్గమధ్యలో భరత్ ప్రాణాలు విడిచాడు. కొన్ని రోజుల క్రితమే హైదరాబాద్ లోని అంబర్ పేటలో ఆరేళ్ల బాలుడు కుక్కల దాడిలో చనిపోయిన క్రమంలో సీసీ టీవీ ఫుటేజ్ బయటకు రావడంతో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగింది. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే బాలుడు చనిపోయాడనే ఆరోపణలు వెల్లువెత్తగా కుక్కల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరినా ప్రభుత్వ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని నెటిజన్లు విమర్శిస్తున్నారు. బాలుడి మృతితో కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు కుక్కల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.