ఈ రోజు ఖమ్మంలో బీజేపీ (BJP) బహిరంగ సభ(public meeting ) నిర్వహించనుంది. కేంద్రమంత్రి అమిత్ షా(Amit Shah) ఖమ్మం నుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Meeting in Khammam : ఈ రోజు ఖమ్మంలో బీజేపీ (BJP) బహిరంగ సభ(public meeting ) నిర్వహించనుంది. కేంద్రమంత్రి అమిత్ షా(Amit Shah) ఖమ్మం నుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరో మూడు నెలల్లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు(Telangana Assembly Elections) ఉండడంతో అమిత్ షా(Amit Shah) సభను పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించడం, కాంగ్రెస్ పార్టీ కూడా వడివడిగా అభ్యర్థుల ప్రకటించే పనిలోనే ఉండటంతో.. ఆదివారం జరగబోయే సభలో అమిత్ షా హాజరుకానుండటంతో ఆయన ఏం మాట్లాడతారు? ఏఏ కీలక ప్రకటనలు చేస్తారు? ఈరోజు షా సమక్షంలో బీజేపీలో ఎవరైనా చేరతారా వంటి విషయాలతో రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది.
కాంగ్రెస్ చేవెళ్ల సభకు దీటుగా అమిత్ షా(Amit Shah) సభను నిర్వహించాలని ఎప్పటి నుంచో బీజేపీ నిర్ణయం తీసుకుంది. అయితే రకరకాల కారణాలతో మూడు వాయిదాల తర్వాత ఖమ్మం వేదికగా ఎట్టకేలకు అమిత్ షా సభ ఈ రోజు జరగబోతోంది. దీంతో ఖమ్మంతో పాటు ఉమ్మడి నల్గొండ, వరంగల్ జిల్లాల నుంచి సభ కోసం జనాలను సమీకరించడంపై పార్టీ నేతలు బిజీ అయిపోయారు.
మరోవైపు మూడు నెలల ముందు పరిస్థితులు ఎలా ఉండేవో కానీ.. ఇప్పుడు ఖమ్మంలో సభ జరిగే సమయానికి మాత్రం అన్నీ ప్రతికూల పరిస్థితులే ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivasa Reddy)ని పార్టీలోకి తీసుకెళ్లడంతో ఆ పార్టీ విఫలైమయిందనే చెప్పొచ్చు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ అధ్యక్షుడు కోనేరు చిన్ని(Koneru Chini) బీఆర్ఎస్లో చేరారు. దీంతోనే అమిత్ షా సభను కిషన్ రెడ్డి(Kishan Reddy), ఈటల రాజేందర్ (Etala Rajender) ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
అటు ఖమ్మం సభ పూర్తి అయిన తర్వాత బీజేపీ ముఖ్యనేతలతో అమిత్ షా (Amit Shah)ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికలను బీఆర్ఎస్,కాంగ్రెస్‌లకు వ్యతిరేకంగా ఓటర్లను మార్చడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే దానిపై కిషన్ రెడ్డి(,Kishan Reddy), ఈటల (Etala Rajender), బండి సంజయ్(Bandi Sanjay), లక్ష్మణ్ ( Laxman), డీకే అరుణ (DK Aruna)కు అమిత్ షా(Amit Shah) దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే అభ్యర్థుల ఎంపిక, మెుదటి జాబితాపై కూడా పార్టీలోవారికి క్లారిటీ ఇచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.