టీడీపీ అధినేత(TDP Chief) , మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను (Chandrababu Arrest) బీఆర్ఎస్ మంత్రి మల్లారెడ్డి (Minister Malla Reddy) ఖండించారు.
Mallareddy: టీడీపీ అధినేత(TDP Chief) , మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను (Chandrababu Arrest) బీఆర్ఎస్ మంత్రి మల్లారెడ్డి (Minister Malla Reddy) ఖండించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన..ఏపీ ముఖ్యమంత్రి జగన్ (AP CM Jagan) రాజకీయ కక్షతోనే చంద్రబాబును అరెస్టు చేయించారని మల్లారెడ్డి ఆరోపించారు.
అంతేకాదు చంద్రబాబు అరెస్టు వెనుక కచ్చితంగా బీజేపీ (BJP) హస్తముందని మల్లారెడ్డి ఆరోపించారు. ఇది వైఎస్సార్సీపీ, భారతీయ జనతా పార్టీలు కలిసి చేసిన కుట్ర అని మంత్రి మండిపడ్డారు. కేంద్రానికి తెలియకుండానే ఒక మాజీ ముఖ్యమంత్రిని ఎవరైనా అరెస్టు చేస్తారా? అని మల్లారెడ్డి ప్రశ్నించారు.
ఎఫ్ఐఆర్లో చంద్రబాబు పేరు లేకుండానే ఆయనను అరెస్ట్ చేయడం అన్యాయమని మల్లారెడ్డి అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం లేనే లేదని..స్కిల్ డెవలప్మెంట్లో చంద్రబాబు నాయుడు ఎలాంటి తప్పు చేయలేదని ఆయన చెప్పుకొచ్చారు. చంద్ర బాబు కోసం ఐటీ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు.. తన మద్దతును తెలియజేస్తానన్నారు మల్లారెడ్డి. చంద్రబాబు అరెస్ట్(Chandrababu’s arrest), అన్యాయమని..అది హేయమైన చర్య అని మంత్రి మల్లారెడ్డి ఫైర్ అయ్యారు.