Bandi Sanjay: బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్పై (CM KCR) మరోసారి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ (Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ (Congress) గెలవడానికి కేసీఆర్ ఫండింగ్ చేశారని ఆరోపించారు.
Bandi Sanjay: బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్పై (CM KCR) మరోసారి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ (Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ (Congress) గెలవడానికి కేసీఆర్ ఫండింగ్ చేశారని ఆరోపించారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలకు (Karnataka election results).. తెలంగాణకు ఏం సంబంధం అని ప్రశ్నించారు. తెలంగాణలోని ఏ ఎన్నికల్లోనూ కాంగ్రెస్కు డిపాజిట్ దక్కలేదని.. అలాంటిది ఏ విధంగా ప్రత్యామ్నాయం అవుతుందని అన్నారు. తెలంగాణ ప్రజలంతా బీజేపీ వైపే చూస్తున్నారని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్కు పోటీ బీజేపీ మాత్రమేనని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ను లేపేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అందుకోసమే కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్కు సపోర్ట్ చేశారని వెల్లడించారు. మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసేందుకు కేసీఆర్ 21 రోజులు కార్యక్రమాలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ సింగిల్గానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ కొలువుదీరుతుందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.
ఇక తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత వైద్యం అందజేస్తామని బండి సంజయ్ వెల్లడించారు. అలాగే అధికారంలోకి వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి.. రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. ఉచిత విద్యను అమలు చేయడంతో పాటు.. సకాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తామని తెలిపారు. రైతులకు లాభం చేకూరేలా ఫసల్ బీమా యోజన పథకంను అమలు చేస్తామని బండి సంజయ్ వెల్లడించారు.