Bandi Sanjay : యుద్ధం స్టార్ట్ అయింది .. ఎన్నికలు ఎప్పుడు అయినా రావొచ్చు!
Bandi Sanjay Fires on BRS : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధికార బీఆర్ఎస్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే కేంద్రాన్ని బీఆర్ఎస్ నేతలు బద్నాం చేస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడానికి కుట్ర చేస్తున్నారు తప్ప అభివృద్ధి చేయడం లేదని విమర్శించారు. అసలు తెలంగాణాలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? అని బండి సంజయ్ ప్రశ్నించారు. కేటీఆర్ అయ్య(కేసీఆర్)ను చర్చకు రమ్మని సవాల్ చేశానని అయినా ఎలాంటి ఉలుకు పలుకు లేదని అన్నారు. కల్యాణలక్ష్మి, రైతుబంధు, పెన్షన్లు లాంటి నాలుగు పథకాలు ఇచ్చి ఎంతో చేస్తున్న అని గొప్పలు చెప్పుకుంటున్నారని బండి సంజయ్ విమర్శించారు.
ఇక ఊళ్లలో రోడ్లు లేవు, అయినా జీతాలు ఇవ్వలేని వాడు అభివృద్ధి ఎలా చేస్తారు? అని ఆయన ప్రశ్నించారు. ఇక బీజేపీ నేతలు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళాలని పేర్కొన్న బండి కార్పొరేటర్ లు కష్టపడి పని చేయాలని, అహంకారంతో ఉండొద్దు, చెడ్డ పేరు తీసుకు రావొద్దని అన్నారు. ఇక కష్టపడే వారికి పార్టీ పూర్తి స్థాయిలో సహకరిస్తుందని పేర్కొన్న ఆయన మోడీ పర్యటన కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని అన్నారు. ఎన్నికల యుద్ధం స్టార్ట్ అయింది .. ఎన్నికలు ఎప్పుడు అయిన రావొచ్చని బెంగాల్ లెక్క ఇక్కడ చేయాలి అంటే బిజెపి కార్యకర్తలు భయపడరు, ఉరికిచ్చి కొడతారని హెచ్చరించారు. బీఆర్ఎస్ నేతలను ఉరికిచ్చే దమ్ము ఉన్న పార్టీ బిజెపి అని ఆయన అన్నారు. ఇక హిందూ ధర్మాన్ని కించపరిస్తే ఉపేక్షించేది లేదు… స్పందించక పోతే బిజెపి కార్యకర్తలమే కాదని అన్నారు.