Bandi Sanjay: టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యులందరినీ రద్దు చేయాల్సిందే!
Bandi Sanjay on Paper leakage: ఇది ….లీకేజీ….ప్యాకేజీ…నిరుద్యోగుల డ్యామేజీ సర్కార్ ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. TSPSC పరీక్షలన్నీ లీక్ అయ్యాయని, గ్రూప్-1 ప్రశ్నాపత్రం సైతం లీకేజీ అయిందని అన్నారు. ఇదిగో సాక్ష్యం అంటూ ప్రవీణ్ ఓంఆర్ షీట్ విడుదల చేసిన బండి సంజయ్ పేపర్ లీక్ చేసిన టీఎస్పీఎస్సీ సెక్రటరీ పీఏ ప్రవీణ్ కు అత్యధిక మార్కులా? అని ప్రశ్నించారు. ప్రవీణ్ పరీక్ష రాసే కాలేజీకి ప్రత్యేకంగా పరీక్ష నిర్వహిస్తారా? అని ఆయన ప్రశ్నించారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడతారా? అని ప్రశ్నించిన ఆయన టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యులందరినీ రద్దు చేయాల్సిందేనని అన్నారు. రాబోయే రెండు నెలల్లో జరగబోయే పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలన్నీ కేసీఆర్ టీంకు లీక్ అయ్యాయని గతంలో సింగరేణి పరీక్షా పత్రాల లీకేజీ కూడా అయిందని, అందుకే లీకేజీ పై న్యాయ విచారణ జరపాల్సిందేనని అన్నారు. ఉద్యోగాలివ్వలేక… ఇంత దారుణాలకు ఒడిగడతారా? అని అన్నారు. లేనిపక్షంలో నిరుద్యోగులతో ప్రగతి భవన్, టీఎస్సీఎస్సీని ముట్టడిస్తామని అన్నారు.