Bandi Sanjay: అమితా షా మీటింగ్.. గాలి తీసేసిన బండి సంజయ్!
Bandi Sanjay: ఢిల్లీలో అమిత్ షాతో భేటీ అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీనే ప్రత్యామ్నాయం అని అన్నారు. తెలంగాణలోని అన్ని సమస్యలపై బిజేపి పోరాడుతోందని పేర్కొన్న ఆయన కార్నర్ స్ట్రీట్ మీటింగ్ లు విజయవంతం అయ్యాయని, ఈ విషయం లో బీజేపీ సెంట్రల్ టీమ్ సంతోషం వ్యక్తం చేసిందని అన్నారు. ఇవాళ జరిగిన సమావేశం రొటీన్ సమావేశం అని 15 రోజుల క్రితమే ఈ సమావేశానికి ప్లాన్ చేశారని అన్నారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సభలు నిర్వహిస్తామన్న ఆయన 10 జిల్లాల్లో పెద్ద సమావేశాలు పెడతామని అన్నారు. ఆ తర్వాత మోడీతో భారీ సభ ఉంటుందని అన్నారు. ప్రజా సమస్యలపై బిజెపి పోరాటం చేస్తుందన్న బండి ఎన్నికలు ఎప్పుడయినా బిజెపి సిద్ధంగా ఉందని అన్నారు.
కాంగ్రెస్, బిఅర్ఎస్ లు బిజెపికి అభ్యర్థులు లేరని ప్రచారం చేస్తున్నారు కానీ అది నిజం కాదని ఆయన అన్నారు. ఇక బీజేపీ పూర్తి స్థాయిలో రంగంలోకి దిగనుంది అనేది ఆయన క్లారిటీ ఇచ్చారు. బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని జనం భావిస్తున్నారన్న ఆయన తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. పార్టీలోకి రావలనుకునే నాయకులకు స్వాగతం పలికిన సంజయ్ లిక్కర్ కేసులో కవిత పేరు వచ్చింది, కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదు? అని ఆయన ప్రశ్నించారు. సిసోడియా అరెస్ట్ పై స్పందిస్తున్న కెసిఆర్, కవిత పై ఎందుకు మాట్లాడటం లేదన్న ఆయన ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మేము సిద్ధమని అన్నారు. అన్ని నియోజకవర్గాల్లో బిజెపికి అభ్యర్థులు ఉన్నారని ఆయన అన్నారు.