Baahubali scene: తెలంగాణ వరదల్లో బాహుబలి సీన్.. బుట్టలో బాలుడు
Baahubali scene floods in Telangana:తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని దాదాపుగా అన్ని ప్రాజెక్టులు పూర్తిగా నిండిపోయాయి. వాగులు, వంకలు పోటెత్తాయి. వెరసి లోతట్టు ప్రాంతాలు వరదలో మునిగాయి. బాధితులను రెస్క్యూటీం పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇదే సమయంలో పెద్దపల్లి జిల్లా మంథనిలో బాహుబలి సినిమా సీన్ కనిపించింది. బాహుబలిలో రిల్ సీన్ అయితే మంథనిలో జరిగింది రియల్ సీన్. వరదల్లో ఓ మూడు నెలల బాలుడు, అతడి కుటుంబం చిక్కుకుపోయింది. సమాచారం అందుకున్న గజ ఈతగాళ్లు ఆ బాలుడి ఇంటికి వెళ్లి ఆ కుటుంబాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించారు.
3 నెలల వయసున్న బాలుడిని ఓ బుట్టలో పొత్తిళ్లలో చుట్టి పడుకోబెట్టి.. ఆ బుట్టను రెస్క్యూ టీం సభ్యుడు తన నెత్తిన పెట్టుకుని గొంతు వరకు ఉన్న నీటిలో చిన్నగా కదులుతూ సాగాడు. నెలల తల్లి అయిన ఆ బాలుడి తల్లిని ఆమె భర్త పొదివి పట్టుకుని నీటిని దాటించాడు. ఈ క్రమంలో రెస్క్యూ టీంకు చెందిన మరో సభ్యుడు బాలుడు ఉన్న బుట్టను అందుకుని సురక్షితంగా ఒడ్డుకు చేర్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ వీడియాలో వైరల్గా మారింది.