Bairi Naresh: పోలీసుల సమక్షంలోనే బైరి నరేష్ పై అయ్యప్ప భక్తులు దాడి
Bairi Naresh: గతంలో అయ్యప్పపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ పై అయ్యప్ప భక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. ఈ విషయమై నమోదైన కేసులో బైరి నరేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కొద్దిరోజుల కిందట బెయిల్ పై నరేష్ జైలు నుండి బయటకు వచ్చాడు. బెయిల్ పై బయటకు వచ్చిన నరేశ్ తిరిగి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆగ్రహం వ్యక్తం చేసిన అయ్యప్ప భక్తులు మరోసారి బైరి నరేష్ పై దాడి చేసారు. అది కూడా పోలీసుల ఉండగానే..పోలీస్ వాహనంలో నరేష్ పై దాడి చేసారు.
జైలు నుండి బయటకు వచ్చాక నరేష్ అయ్యప్ప స్వామిపై మరోసారి నరేశ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఆగ్రహం తో రగిలిపోయిన అయ్యప్ప భక్తులు వరంగల్ లో పోలీసులు నరేష్ ను పొలిసు వాహనంలో తీసుకెళ్లడం చూసిన కొంతమంది భక్తులు వాహనంను వెంబడించి నరేష్ ను కిందకు లాగి దాడి చేశారు. మరోవైపు దీనిపై నరేశ్ స్పందిస్తూ.. తనపై దాడి చేస్తారనే పోలీసుల రక్షణను అడిగానని పోలీసుల వాహనంలో ఉండగానే తనపై దాడి చేశారని చెప్పాడు. పోలీసుల వాహనంలో వెళ్తుంటే వెంబడించి దాడి చేశారని వాపోయాడు. తనకు గన్ లైసెన్స్ కావాలని డిమాండ్ చేశాడు.