సవాళ్లను ఎదుర్కోవడంలో ఏవియేషన్ ముందుంది: కేంద్ర మంత్రి
హైదరాబాద్‌లో జరుగుతున్న వింగ్స్ ఏవియేషన్ షో కార్యక్రమంలో కేంద్ర మంత్రి జోతిరాదిత్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిని ఆయన.. గత రెండేళ్లుగా ఏవియేషన్ ఇండస్ట్రీ ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొందన్నారు. సవాళ్లను ఎదుర్కోవడంలో, వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ప్రపంచ దేశాలతో పోల్చితే భారత్ ముందుందన్నారు. 1400 బిలియన్ డాలర్లతో ఇన్ఫ్రాస్ట్రక్షర్‌ని పెంపొందిస్తున్నామన్నారు.
రోడ్‌లు, వాటర్‌పైప్ లైన్‌లు, ఏవియేషన్ ఇండస్ట్రీ అభివృద్ధి వంటి పనులను వేగవంతం చేశామన్నారు. ఎకనామిక్ గ్రోత్ పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. భారత్‌లో ఏవియేషన్‌కు మంచి భవిష్యత్ ఉందని, కోవిడ్ కంటే ముందు విమానాల్లో ప్రయాణించే వారితో పోల్చితే ఇప్పుడు విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య పెరిగిందన్నారు. ఎకనామిక్ గ్రోత్ పెంచేందుకు కృషి చేస్తున్నామన్న మంత్రి.. ఏవియేషన్ ఇండస్ట్రీలో ఒక డాలర్ ఇన్వెస్ట్ చేస్తే.. 3.1 డాలర్లు వచ్చే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆదివారం నుంచి పూర్తి స్థాయిలో అంతర్జాతీయ విమానాలు నడుపుతామని మంత్రి తెలిపారు. కాంగ్రెస్ హయాంలో ఇండియాలో 74 ఎయిర్ పోర్ట్‌లు ఉంటే ఏడేళ్లలో వాటి సంఖ్య ఇప్పుడు 140కి పెంచామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రి వేములు ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. హైదరాబాద్ నగరంలో వింగ్స్ ఏవియేషన్ షో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.