తెలంగాణలో ప్రముఖ ఇన్ప్రా కంపెనీలపై దాడులు
తెలంగాణలో నాలుగు ప్రముఖ ఇన్ప్రా కంపెనీలపై ఐటీ శాఖ ఒకే సారి దాడులు చేసింది. KNR ఇన్ప్రా, గజ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, RVR, GVPR కంపెనీల్లో దాడులు నిర్వహించింది. 150 కోట్ల లావాదేవీలకు ట్యాక్స్ కట్టలేదని ఒప్పుకుంది KNR కంపెనీ. KNR కంపెనీకి నరసింహా రెడ్డి, జలేందర్ రెడ్డి ఛైర్మన్‌లుగా ఉన్నారు. మరోవైపు 50 కోట్లకు ట్యాక్స్ కట్టలేదని గజ ఇంజనీరింగ్ సంస్థ ఒప్పుకుంది. దీంతో పాటు RVR సంస్థ 60 కోట్లకు ట్యాక్స్ కట్టలేదని ఐటీ అధికారుల ముందు అంగీకరించింది.