Hyderabad: హైదరాబాద్‌లో ఉగ్రమూకలు కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇటీవల తనిఖీలు జరిపి పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు ముమ్మరంగా దర్యాప్తు జరుపుతున్నారు. సోమవారం మరోసారి హైదరాబాద్‌లోని పలు చోట్ల తనిఖీలు నిర్వహించారు.
Hyderabad: హైదరాబాద్‌లో ఉగ్రమూకలు కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇటీవల తనిఖీలు జరిపి పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు ముమ్మరంగా దర్యాప్తు జరుపుతున్నారు. సోమవారం మరోసారి హైదరాబాద్‌లోని పలు చోట్ల తనిఖీలు నిర్వహించారు. బాబానగర్, చంద్రాయన్ గుట్టలో మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరితో కలిపి హైదరాబాద్‌లో మొత్తం 8 మందిని అరెస్ట్ చేశారు.
మరోవైపు ఇంతకముందు భోపాల్‌లో 11 మందిని కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు ఉగ్రవాద కార్యకలాపాల కేసులో హైదరాబాద్, భోపాల్‌లో కలిపి మొత్తం 19 మందిని కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు. వారందరికీ కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ హిజ్భ్ ఉత్ తహరీర్తో సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ముందుగా హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన ఆరుగురిని భోపాల్‌కు తరలించారు. వారందరిని భోపాల్ ఏటీఎస్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. రహస్య ప్రదేశంలో ఉంచి వారిని విచారించారు.
అయితే విచారణలో వారిచ్చిన సమాచారం ఆధారంగా ఏటీఎస్ పోలీసులు హైదరాబాద్ వచ్చి స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారికి కూడా ఉగ్రవాద సంస్థ హిజ్భ్ ఉత్ తహరీర్తో సంబంధాలు ఉన్నట్లు అధికారులు నిర్దారణకు వచ్చారు. దీంతో వారిని కూడా భోపాల్‌కు తరలించనున్నారు.