నీరాలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి : జోగి రమేశ్
AP Minister : తెలంగాణ (Telangna)ప్రభుత్వం (Government)పై ఏపీ మంత్రి (Minister) జోగి రమేశ్ (jogi Ramesh) ప్రశంసలు కురిపించారు. నీరా కేఫ్ (Neera Cafe)ను ప్రమోట్ చేసి ఔన్నత్యాన్ని పెంచారని ఏపీ మంత్రి జోగి రమేశ్ అన్నారు. హైదరాబాద్ నగరం నడిబొడ్డున నెక్లెస్ రోడ్డు (Neclece Road)లో ఏర్పాటు చేసిన నీరా కేఫ్‌ను మంత్రి జోగి రమేష్, ఆయన తనయుడు జోగి రాజీవ్ సందర్శించారు. ప్రకృతి సిద్ధమైన, స్వచ్ఛమైన నీరాను రాష్ట్ర ప్రజలకు అందించడం పట్ల మంత్రి జోగి రమేష్ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. ఈ సందర్భంగా నీరా కేఫ్‌లో లభ్యమవుతున్న ఉత్పత్తుల గురించి మంత్రి శ్రీనివాస్ గౌడ్ వివరించారు.
ప్రముఖ చలనచిత్ర నటుడు తల్వార్ సుమన్ (Suman), తెలంగాణ రాష్ట్ర ముఖ్య ప్రజా ప్రతినిధులు నాయకులు, గౌడ సంఘ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో ల్గొన్నారు. నీరాలో ఔషధ గుణాలు చాలా ఉన్నాయని పలు పరిశోధనల్లో రుజువైందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) అన్నారు. చాలా మంది నీరాపై దుష్ర్పచారం చేశారని గీత వృత్తి కార్మికుల కోసమే నీరా కేఫ్‌ను అందుబాటులోకి తెచ్చామని మంత్రి అన్నారు.