Amith sha: పాలమూరు బరిలో అమిత్ షా..?
Amith sha: ప్రస్తుతం మన దేశ రాజకీయాల్లో నరేంద్ర మోడీ, అమిత్ షా హిట్ పెయిరే అనాలి. ఎందుకంటే వీళ్ళు ఎక్కడకు వెళ్లినా పార్టీకి ఓట్ల పంటే అని బీజేపీ వర్గాలు భావిస్తుంటాయి. ఒకవిదంగా చెప్పాలంటే మోడీ టీం కు అమిత్ షా సర్వ సైన్యాధిపతి. పార్టీ లేదా ఎన్నికలకు సంబంధించి ఏ నిర్ణయం కూడా అమిత్ కు చెప్పకుండా మోడీ తీసుకోరంటే అతిశయోక్తి కాదు. వివిధ రాష్టాల్లో జరుగుతున్న ఎన్నికల్లో గెలవడానికి అవసరమైన చాణక్య నీతిని అమిత్ షా ప్రదర్శిస్తుంటారు.
పాలమూరు నుంచి వచ్చే ఎన్నికలలో ప్రధాని మోదీ పోటీ చేయబోతున్నాడనే వార్త ఆమధ్య వైరల్ అయింది. కానీ తాజాగాపాలమూరు బరిలో అమిత్ షా దిగబోతుందని సమాచారం అందుతుంది. అమిత్ షా డైరెక్షన్లో పాలమూరు నుండి బరిలోకి దిగే ఛాన్స్ ఉందని పార్టీ నాయకులంటున్నారు. మరోవైపు 2024 సార్వత్రిక ఎన్నికల్లో దక్షిణాది నుంచి అత్యధిక పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకోవాలని చూస్తుంది.
బీజేపీ పార్టీ అగ్రనాయకులను కొందరిని దక్షిణాది నుంచి బరిలో దింపాలని అధిష్టానం భావిస్తోందట. ఈ క్రమంలోనే తెలంగాణ నుంచి కేంద్ర హోం మంత్రి అమిత్ షానుఎన్నికల బరిలో దింపాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. మహూబ్‌నగర్ నుంచి అమిత్ షాను బరిలో నిలపాలని సమాచారం అందుతుంది. జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న బీజేపీ కోర్ గ్రూప్ సమావేశాల్లోనూ తెలంగాణ టాపిక్ తరచూ వస్తుంది కనుకే అధిష్టానం అమిత్ షా ను పాలమూరు బరిలో దింపాలని చూస్తుంది.