అమిత్ షా కు తెలంగాణపై అవగాహన లేదని.. ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్‌ను అలా అలా చదివేసి పోయారని హరీష్ రావు ఎద్దేవా చేశారు. అమిత్ షా ముందు గుజరాత్ గుడ్డి పాలనను సరి చేసుకోవాలని మంత్రి సూచించారు.
Minister Harish Rao: తెలంగాణ భవన్‌లో ఎమ్మార్పీఎస్ నాయకుడు యాతాకుల భాస్కర్(Yatakula Bhaskar) గురువారం మధ్యాహ్నం.. మంత్రి హరీశ్ రావు(Harish Rao) సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. దళిత జాతి మేలు కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి భాస్కర్ అని హరీష్ రావు కొనియాడారు. దళితజాతి అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలన్నీ.. యాతాకుల భాస్కర్(Yatakula Bhaskar)ను ఆకట్టుకున్నాయని అన్నారు.భాస్కర్ సేవలను బీఆర్ఎస్ తప్పకుండా ఉపయోగించుకొని.. ఆయనకు ఉన్నత స్థానం ఇస్తాదని హరీష్ రావు హామీ ఇచ్చారు.
చాలా పార్టీలు ఎన్నికలు రాగానే నోటికొచ్చిన వాగ్ధానాలు చేసేస్తాయని హరీష్ రావు(Harish Rao) విమర్శించారు. నినాదాలు మాత్రమే చేసేవి కొన్ని పార్టీలు అయితే.. నినాదాలను నిజం చేసే పార్టీ బీఆర్ఎస్ అని హరీష్ రావు చెప్పారు.ఇప్పుడంతా నకిలీ మాటలు, వెకిలి చేష్టలు చేస్తున్న పార్టీలే ఎక్కువయ్యాయని ఎద్దేవా చేశారు.
ఇక అమిత్ షా(Amit Shah)కు తెలంగాణపై అవగాహన లేదని.. ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్‌ను అలా అలా చదివేసి పోయారని హరీష్ రావు(Harish Rao) ఎద్దేవా చేశారు. అమిత్ షా(Amit Shah) ముందు గుజరాత్ గుడ్డి పాలనను సరి చేసుకోవాలని మంత్రి సూచించారు. అటు ఖర్గే సొంత రాష్ట్రమయిన కర్ణాటకలో హామీలు అమలు కావడం లేదన్న హరీష్ రావు.. బీజేపీపై కర్ణాటక ప్రజలకు కక్కురావడంవల్లే అక్కడ కాంగ్రెస్ గెలిచిందంటూ ఘాటు కామెంట్లు చేశారు.
బీఆర్ఎస్ స్లోగన్ సర్కార్ కాదని సొల్యూషన్ సర్కార్ అని హరీష్ రావు అన్నారు. ప్రపంచంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టిన ఏకైక సర్కార్ తెలంగాణదే అని.. సెక్రటేరియట్‌కు అంబేద్కర్ పేరు పెట్టి ఆయనపై భక్తిని చాటుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ( Kcr)అని హరీష్ రావు గుర్తు చేశారు.
పార్లమెంట్‌కు అంబేద్కర్ పేరు పెట్టమంటే కేంద్రం ముఖం చాటేసిందని హరీష్ రావు మండిపడ్డారు. అంబేద్కర్ మార్గంలోనే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నడుస్తోందని మంత్రి అన్నారు. తర్వాత రాఖీ పండుగ సందర్భంగా రాష్ట్ర మహిళలకు హరీశ్ రావు(Harish Rao) శుభాకాంక్షలు తెలియజేశారు.