BJP: టీ.బీజీపీ నేతలకు అధిష్టానం పిలుపు.. సర్వత్రా ఆసక్తి!
BJP Meeting: తెలంగాణా బీజేపీ నేతలు బండి సంజయ్, ఈటెల రాజేందర్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు అమిత్ షాతో తెలంగాణ నేతలు భేటీ కానున్నారు. కార్నర్ మీటింగ్ ల ముగింపు సభలు ఉన్నా ఢిల్లీ నుంచి పిలుపు రావడంతో రేపటి భేటీ పై అందరి చూపు పడిందని చెప్పొచ్చు. ఇక రేపు ఉదయం ఢిల్లీకి డీకే అరుణ వెళ్లబోతున్నారని అంటున్నారు. రేపటితో బీజేపీ కార్నర్ మీటింగ్ లు ముగియనున్న క్రమంలో 8 వేలకు పైగా బీజేపీ కార్నర్ మీటింగ్ లు నిర్వహించింది. 11 వేల మీటింగ్ లు నిర్వహించాలని టార్గెట్ పెట్టుకున్న కమలం పార్టీ రేపు 119 నియోజక వర్గాల్లో ముగింపు సభలు నిర్వహిస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్, కావడం అదే కేసులో తెలంగాణా సీఎం కుమార్తె కవిత పేరు కూడా ఉండడంతో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ ఎంపీ కె లక్ష్మణ్, రాష్ట్ర పార్టీ సంస్థాగత ఇన్‌చార్జి సునీల్ బన్సల్, జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, విజయశాంతి, మురళీధర్ రావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితరులు హాజరు కానున్నట్టు తెలుస్తోంది.