హైదరాబాద్ కేంద్రంగా ఓ నకిలీ ఆఫీసర్ అనేక దందాలు చేస్తూ దొరికిపోయాడు. టెక్నాలజీ సాయంతో దేశ వ్యాప్తంగా నేరాలకు పాల్పడ్డ ఆ మోసగాడి అచరాకాలు నివ్వెరపరిచేలా ఉన్నాయి.
Fake IPS Officer : హైదరాబాద్ లో నకిలీ ఐపీఎస్ అధికారి (Fake IPS Officer)ని పోలీసులు (Police)అరెస్టు చేశారు. ఐపీఎస్ అధికారిని, ఆర్మీ కల్నల్ అని నమ్మించి మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీలోని భీమవరం (Bheemavarm) పట్టణానికి చెందిన కార్తీక్ (Kartik)అలియాస్ నాగరాజు (Nagaraju)గా గుర్తించారు.
టెక్నాలజీ సాయంతో
ఈ నకిలీ ఆఫీసర్ టెక్నాలజీని అడ్డుపెట్టుని అందరినీ మోసం చేసిన వ్యవహారం నివ్వెరపరుస్తోంది. ఆర్మీ కల్నల్, ఎన్కౌంటర్ స్పెషలిస్టు అని నమ్మించి కార్తిక్ పలు రాష్ట్రాల్లో అక్రమాలకు పాల్పడ్డాడు నాగరాజు. టెక్నికల్‌గా ఆరితేరిన కార్తిక్.. ప్రభుత్వ అధికారులు, ధోనీతో ఉన్నట్లుగా ఫొటోలు క్రియేట్ చేశాడు. వాటిని చూపిస్తూ.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, పదవులు ఇప్పిస్తానని కార్తీక్ డబ్బులు వసూలు చేసేవాడు.
హైదరాబాద్ లో ఆఫీస్
ఇంకా నాగరాజు సైబరాబాద్‌లో ఏకంగా ఓ కార్యాలయాన్ని ఓపెన్ చేశాడు. ఆ ఆఫీసు అడ్డాగా సెటిల్మెంట్లు చేస్తుండగా పోలీసులకు చిక్కాడు. ఈ నకిలీ ఆఫీసర్ అరాచకాలు హైదరాబాద్ తో ఆగలేదు. దేశ వ్యాప్తంగా
అనేక అక్రమాలపై మొత్తంగా 8 కేసులు నమోదైనట్టు పోలీసులు తేల్చారు.
తుపాకులు స్వాధీనం
హైదరాబాద్ కేంద్రంగా ఓ నకిలీ ఆఫీసర్ అనేక దందాలు చేస్తూ దొరికిపోయాడు. టెక్నాలజీ సాయంతో దేశ వ్యాప్తంగా
నేరాలకు పాల్పడ్డ ఆ మోసగాడి అచరాకాలు నివ్వెరపరిచేలా ఉన్నాయి.మధుసూదన్ అనే వ్యక్తిని బెదిరించడంతో పంజాగుట్టలో కూడా అతనిపై కేసు నమోదైందని తెలిపారు. కార్తీక్‌ను అరెస్టు చేసి అతని నుంచి ఒక కంట్రీ మేడ్ పిస్టల్‌తో పాటు 23 వస్తువులను సీజ్ చేశారు. రూ.2 లక్షల విలువైన ప్రాపర్టీని స్వాధీనం చేసుకున్నారు.