హైదరాబాద్ లో డ్రగ్స్ ఆపరేషన్.. పోలీసుల అదుపులో సినీ నటులు?
హైదరాబాద్ పబ్ లో డ్రగ్స్ వ్యవహారం అనూహ్య పరిస్థితుల్లో తెరమీదకు వచ్చింది. ఇప్పటివరకు పబ్బుల్లో డ్రగ్స్ దొరుకుతుందని వినడమే కానీ ఈసారి రెడ్ హ్యాండెడ్ గా దొరికినట్టు చెబుతున్నారు. మొన్నటికీ మొన్న హైదరాబాద్ డ్రగ్స్ కేసులో తొలి మరణం నమోదు కాగా పోలీసులు సీరియస్ అయ్యారు. ఈ క్రమంలోనే బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఉన్న రాడిసన్ ఫుడింగ్ అండ్ మింక్ పబ్లో డ్రగ్స్ వినియోగం జరుగుతోందని గుర్తించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు రైడ్స్ చేయడంతో పోలీసుల రంగప్రవేశంతో కిటికీ నుంచి యువతీ యువకులు డ్రగ్స్ విసిరినట్టు చెబుతున్నారు. ఈ క్రమంలోనే రాహుల్ సిప్లీగంజ్ సహా అనేక మంది నటీనటులు, ఒక ప్రముఖ నటిని అదుపులోకి తీసుకున్నారని అంటున్నారు. అనేకమంది రాజకీయ నాయకుల పిల్లలు, అధికారుల పిల్లలు కూడా ఉన్నట్టు చెబుతున్నారు.