Accident: హైదరాబాద్ శివారులోని గండిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Accident) చోటుచేసుకుంది. మితిమీరిన వేగంతో వెళ్తున్న కారు (Car) అదుపు తప్పి ఆగివున్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందగా.. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Accident: హైదరాబాద్ శివారులోని గండిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Accident) చోటుచేసుకుంది. మితిమీరిన వేగంతో వెళ్తున్న కారు (Car) అదుపు తప్పి ఆగివున్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందగా.. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు.
నిజాంపేటకు చెందిన కొందరు స్నేహితులు గండిపేటలోని ఓషియన్ పార్క్‌కు (Ocean Park) వెళ్దామని ప్లాన్ చేసుకున్నారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం కొందరు కలిసి నిజాంపేట నుంచి కారులో బయల్దేరారు. శంకర్‌పల్లికి వెళ్లి మరికొంత మంది స్నేహితులను కార్ ఎక్కించుకున్నారు. మొత్తం 12 మంది స్నేహితులు ఓషియన్ పార్క్‌కి వెళ్తూ మధ్యలో ఆగి టిఫిన్ చేశారు. ఆ తర్వాత వేగంగా కారు నడుపుతూ రెండు మూడు వాహనాలను ఓవర్ టేక్ చేశారు. ఖానాపూర్ వచ్చాక.. ఓ వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తూ.. పక్కనే ఉన్న కారును ఢీ కొట్టారు.
అతివేగంతో కారు బలంగా లారీని ఢీ కొట్టడంతో కారులో ఉన్న ఇద్దరు అమ్మాయిలు.. ఒక అబ్బాయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో అబ్బాయిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో కన్నుమూశాడు. సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని దగ్గరల్లోని ఆసుపత్రికి తరలించారు. కారు బలంగా లారీని ఢీ కొట్టడంతో ముందు కూర్చున్న ముగ్గురు కారులోని ప్రాణాలు కోల్పోయారు. వారి మృతదేహాలను అతికష్టం మీద పోలీసులు బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
కాగా, ప్రమాద సమయంలో కారులో ఉన్నవాళ్లంతా ఇంటర్ ఫస్ట్, సెకండియర్ విద్యార్థులని పోలీసులు వెల్లడించారు. ఒకే కుటుంబానికి చెందిన అంకితా, అర్షితాతో పాటు నితిన్, అమృత్ అనే విద్యార్థులు మృతి చెందారని అన్నారు. అలాగే ప్రసాద్, ప్రదీప్, అర్జున్, అఖిల్, మౌనిక, సుష్మిత, ధనుష్యా, నిఖిల్ అనే విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారని.. ప్రస్థుతం వారికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. వారిలో ప్రసాద్, అర్జున్, ప్రదీప్ పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు చెప్పారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.