MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు వినూత్నంగా బర్త్ డే విషెష్ చెప్పిన అభిమాని
MLC Kavitha: పెద్దఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కవిత జన్మదినాన్ని పురస్కరించుకొని వివిధ ప్రాంతాల్లో బిఆర్‌ఎస్ నాయకులు పలు సేవా కార్యక్రమాలునిర్వహిస్తున్నారు. కానీ నిజామాబాద్‌కు చెందిన బీఆర్ఎస్ నాయకుడు చిన్ను గౌడ్ వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపాడు. అండమాన్ నికోబార్ దీవుల్లో బంగళా ఖాతం సముద్రపు అంచుల లోకి వెళ్లిన చిన్నుగౌడ్,ఎమ్మెల్సీ కవితకు జన్మదిన శుభాకాంక్షలతో కూడిన బ్యానర్ ను ప్రదర్శించారు. నీటి అడుగున డైవింగ్ చేస్తూ బ్యానర్లను ప్రదర్శించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియోను టీస్ ఫుడ్స్ చైర్మెన్ మేడే రాజీవ్ సాగర్ గారి చేతుల మీదుగా ఆదివారం రాత్రి 12 గంటలకు విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నిజామాబాద్‌కు చెందిన బీఆర్ఎస్ నాయకుడు చిన్ను గౌడ్ వినూత్నంగా శుభాకాంక్షలు తెలుపడంతో ఆయన్ను బీఆర్ఎస్ నాయకులూ అభినందిస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత శనివారం ఈడీ విచారణ ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇక కవితను మరోసారి 16వ తేదీన ఈడీ విచారణకు హాజరుకావాల్సిందింగా ఆదేశించిన విషయం తెలిసిందే.. మరి ఈ సమయంలో కవిత తన పుట్టిన రోజు వేడుకలకు హాజరవుతారా లేదా చూడాలి.