దారుణం : 100 కుక్కలని విషం పెట్టి!
తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో 100కు పైగా వీధి కుక్కలు చంపబడ్డాయని వీధి జంతువుల కోసం పనిచేస్తున్న కార్యకర్త ఒకరు ఆరోపించారు. సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం తీగుల్ గ్రామానికి చెందిన గ్రామ సర్పంచ్, కార్యదర్శి వృత్తిరీత్యా కుక్కలు పట్టేవారిని నియమించి వీధి కుక్కలకు ప్రాణాంతక ఇంజెక్షన్లు వేసి చంపేస్తున్నారని ఆరోపించారు. ఈ సంఘటన మార్చి 27న జరిగినట్లు సమాచారం. హైదరాబాద్‌లోని ఎన్‌జీవోను గ్రామస్థుడు ఒకరు అప్రమత్తం చేయడంతో, సోమవారం జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి బాధ్యులపై కేసులు నమోదు చేయాలని కోరుతూ గౌతమ్ కుమార్ అనే కార్యకర్త సిద్దిపేట కలెక్టర్, సిద్దిపేట పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. గౌతమ్ కుమార్ చెబుతున్న దాని ప్రకారం, తమ పెంపుడు కుక్క చనిపోయిందని తెలుసుకోగా దానిలోకి గల కారణాలను తెలుసుకునేందుకు గ్రామానికి వెళ్లగా పెంపుడు కుక్కకు విషం కలిపినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని స్థానికులు ధృవీకరించారు. ఆ కుక్కలా మృతదేహాలను గ్రామంలోని పాత బావిలో పడేశారు. గత మూడు నెలల్లో దాదాపు 200 వీధి కుక్కలు చంపబడ్డాయని గ్రామస్తులు కార్యకర్తకు తెలిపారు. గ్రామ అధికారులపై ఫిర్యాదు చేసినా స్థానిక పోలీసులు స్పందించకపోవడంతో, కార్యకర్త జిల్లా కలెక్టర్ మరియు పోలీసు సూపరింటెండెంట్‌ను ఆశ్రయించారు. ఇక ఇలా కుక్కలను సామూహికంగా చంపడాన్ని పీపుల్ ఫర్ యానిమల్స్ ఇండియా సంస్థ ఖండించింది. గొయ్యిలో పడి ఉన్న కుక్కల కళేబరాల వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.